హీరో న్యూడ్ ఫోటోషూట్ పై విచారణ

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తాజా మ్యాగజైన్ ఫోటోషూట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒంటిపై నూలుపోగైనా లేకుండా నగ్నంగా కనిపించి షాకిచ్చాడు. అతడి బోల్డ్ అవతార్ ని ప్రశంసించిన వాళ్లు ఉన్నారు. అలాగే విమర్శించిన వాళ్లు ఉన్నారు. కొందరైతే పోలీస్ కేసులు పెట్టారు.  

నగ్న ఫొటోలను రణ్ వీర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి పెను తుఫాన్ సృష్టించాయి. అనంతరం అది మహిళామణుల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

రణవీర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు పోలీసులకు అందింది. దీనిపై ప్రస్తుతం ముంబై పోలీసుల బృందం నోటీసులు అందించడానికి ముందు రోజు రణవీర్ నివాసాన్ని సందర్శించారు.

అయితే పోలీసులు వచ్చేసరికి రణ్ వీర్ ఇంట్లో లేరని తెలిసింది. ఆగస్ట్ 16న తిరిగి నగరానికి వస్తాడని పోలీసులకు సమాచారం అందించారు. ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఆర్డర్ వేసారు.

రణవీర్ సింగ్ పై సెక్షన్ 292 (అశ్లీల పుస్తకాల అమ్మకం)... 293 (యువకులకు అసభ్యకరమైన వస్తువుల అమ్మకం) .. 509 (నమ్రతను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కూడిన చట్టం) కింద అభియోగాలు మోపినట్లు ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. IT చట్టంలోని సెక్షన్ 67Aతో పాటుగా భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం స్త్రీలను కించపరిచే చర్యకు అతడు శిక్షార్హుడు అని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.

రణవీర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తామని దానిపైనే చాలా విషయాలు ఆధారపడి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి భవిష్యత్ ఏంటి?  రణవీర్ కి తప్పించుకునే ఛాన్సుందా లేదా? అన్నదానిపై అంచనా వేయలేం. అతడు అరెస్ట్ అవుతాడా లేక ఇంకేదైనా జరుగుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×