మెల్ బోర్న్ లో మిల్కీ మెరుపులు విరుపులు!

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈరోజు ముందుగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోని ఐకానిక్ ల్యాండ్ మార్క్ వేదికపై భారతీయ సినిమా తారల శ్రేణి అధికారికంగా పండుగను ప్రారంభించింది. రెండేళ్లుగా కరోనా క్రైసిస్ ఆటంకం వల్ల ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ ఉత్సవాన్ని ఈసారి ఘనంగా లైవ్ లీగా నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 12 నుండి ఆగస్ట్ 20 వరకు జరగనున్న ఈ ఉత్సవానికి గొప్ప తారాగణం సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

అభిషేక్ బచ్చన్- తాప్సీ పన్ను- వాణి కపూర్ - షెఫాలీ షా- గాయని సోనా మొహపాత్ర సహా దర్శకనిర్మాతలు అనురాగ్ కశ్యప్ - కబీర్ ఖాన్- అపర్ణా సేన్ - నిఖిల్ అద్వానీ- రిత్విక్ ధంజనీ-షూజిత్ సిర్కార్ అధికారిక లాంచింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇంతమందిలో దక్షిణాది కథానాయిక తమన్నా భాటియా ఎంతో ప్రత్యేకంగా ఈ వేదిక వద్ద ప్రత్యక్షమైంది. అభిషేక్ బచ్చన్- తమన్నా భాటియా- తాప్సీ పన్ను అధికారికంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ ను  జెండా ఊపి ప్రారంభించారు. 120కి పైగా చిత్రాల ప్రదర్శనతో పాటు .. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించనుండడం ఈ వేదిక వద్ద ఆసక్తిని పెంచుతోంది.  

ఫెస్టివల్ లో సౌత్- హిందీ ఫిల్మ్ డిబేట్ గురించి ఒక ప్రశ్నకు సమాధానంగా తమన్నా భాటియా మాట్లాడారు. మిల్కీ స్పందిస్తూ ``ఈ సంభాషణ భారతదేశానికి మాత్రమే యూనిక్. నేను విదేశాలకు వెళ్లినప్పుడల్లా వ్యక్తుల (ఉత్తరాది దక్షిణాది) మధ్య తేడా గురించి ఏదైనా అనడం నేను ఎప్పుడూ వినలేను. విదేశీయులు దానిని భారతీయ సినిమా అని పిలుస్తారు. ఇక్కడ IFFM కూడా అలాంటిదే. ఇటీవల పాన్ ఇండియా చిత్రాలను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు. వాటిని అందరూ మెచ్చుకుంటారు!`` అని అన్నారు.

మిల్కీకి రేర్ ఛాన్స్!

మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం తమన్నాను ఈ ఏడాది వెతుక్కుంటూ రావడం ఆసక్తికరం. ఈ వేడుకల్లో తమన్నా భారతీయత ఉట్టిపడేలా అందమైన చీరలో కనిపించింది. గ్రీన్ కలర్ చీర- డిజైనర్ బ్లౌజ్ లో సమ్మోహనకర పోజులతో మిల్కీ సైరన్ దేశీ అవతార్ లో అదిరే ట్రీటిచ్చింది.

ఈ లుక్ కి మెల్ బోర్న్ మెరుపుల మెరిసే దానా! అంటూ యూత్ ఫిదా అయిపోతున్నారు. తమన్నా నటించిన తాజా బాలీవుడ్ చిత్రం `బబ్లీ బౌన్సర్` త్వరలో విడుదల కానుంది. మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారని తెలిసింది.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×