ఎగిరేందుకు టైం వచ్చింది.. గౌతమ్ పై నమ్రత హింట్!!

కొన్నిసార్లు కొన్నిటికి మీనింగ్ ఎక్స్ ప్రెస్ చేసిన విధానాన్ని బట్టి మారిపోతుంది. అలాంటి వ్యాఖ్యలను `క్రిప్టిక్` అని అంటాం. అలాంటి ఒక క్రిప్టిక్ పోస్ట్ తో నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు అభిమానులకు ఒక కీలకమైన హింట్ ని ఇచ్చారు. ఇంతకీ ఏమిటా క్రిప్లిక్ పోస్ట్? అంటే.. తన వారసుడు గౌతమ్ కృష్ణ ఎగిరేందుకు టైమ్ వచ్చింది.. ఇక ఏదైనా చేయగలవన్న నమ్మకం కలిగింది! అని వ్యాఖ్యానించారు. నువ్వు త్వరలోనే నీ మార్కు ప్రపంచానికి చూపిస్తావ్!! అంటూ గౌతమ్ గురించి కామెంట్ చేసారు. అయితే దీనర్థం ఏమై ఉంటుంది? అంటూ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎవరికి వారు  రకరకాలుగా ఊహాగానాలు సాగిస్తున్నారు.

ఇంతకీ నమ్రత అంత ఎమోషనల్ గా గౌతమ్ పై వ్యాఖ్యానించడానికి కారణం ఏమై ఉంటుంది? అన్నది డిబేటబుల్ గా మారింది.  ఇటీవల కొంతకాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విహారయాత్రలో గౌతమ్ - సితార కూడా ఉన్నారు. అక్కడ గౌతమ్ ఎదిగిన పిల్లాడిలా కనిపిస్తున్నాడు. అతడి ఫోటోలు పరిశీలనగా చూస్తే నూనూగు మీసాల వయసులో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు. గౌతమ్ కృష్ణ అత్యంత సాహసోపేతమైన పారా గ్లైడింగ్ చేశాడు. నిజానికి ఎలాంటి భయం బెరుకు లేకుండా అతడి విన్యాసాలు చూసి నమ్రత షాక్ అయినట్టే కనిపిస్తోంది.

తన వారసుడి విన్యాసాలకు ఉబ్బితబ్బిబ్బవుతూ... నా కుమారుడు మహేష్ బాబుకు మరో ప్రతిబింబం.. ఏదీ కూడా తనని బాధించలేదు.. చలి- ఎండ- మంచు.. ఎంతో నిశ్శబ్దంగా ఉంటాడు.. నీవు నేర్చుకున్న పారాగ్లైడింగ్ పాఠాలు చూసి నాకు గర్వంగా ఉంది.. ఇక నువ్వు ఎగిరేందుకు టైం వచ్చింది.. నువ్ ఏదైనా చేయగలవన్న నమ్మకం నాకు వచ్చింది.. ఇక నువ్వు త్వరలోనే నీ మార్కు ప్రపంచానికి చూపిస్తావ్ అంటూ నమ్రత ఆనందం వ్యక్తం చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తన 47వ పుట్టినరోజు వేడుకల నుంచి ఇది ఊహించని ప్రకటన!

నమ్రత ప్రకటనతో ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది నూనూగు మీసాల వయసుకి వచ్చిన గౌతమ్ త్వరలోనే మరో కొత్త రోల్ పోషిస్తాడని సిగ్నల్ ఇవ్వడమేనని కూడా అభిమానులు భావిస్తున్నారు. గౌతమ్ ఓ వైపు విదేశాల్లో విద్యాభ్యాసం సాగిస్తాడన్న సమాచారం ఉంది. మహేష్ కూడా విదేశాల నుంచి నేరుగా ఇండియాలో దిగుతూనే అప్పట్లో హీరోగా `రాజకుమారుడు` సినిమా చేశాడు. అదే తీరుగా  గౌతమ్ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ లో ఉన్నాడని దీనర్థం. రెక్కలొచ్చాయి.. ఇక ఏదైనా చేయగలవ్!! అన్న ధీమాను నమ్రత కనబరిచారంటే అతడు కూడా నటనలోకి వస్తాడు. తండ్రిలానే పెద్ద స్టార్ అవుతాడు అన్న భావన కూడా తన మాటలో తొణికిసలాడిందని అభిమానులు భావిస్తున్నారు.

గౌతమ్ ఇప్పుడే హీరో కాకపోవచ్చు.. కానీ అతడు స్టడీస్ సాగిస్తూనే గ్యాప్ లో ఇకపై నటనను కొనసాగించేందుకు ఆస్కారం లేకపోలేదు. 1- నేనొక్కడినే చిత్రంతో అతడు బాలనటుడిగా రంగ ప్రవేశం చేశాడు. ఇక మహేష్ తరహాలోనే చిన్న వయసు నుంచే అతడు నటనకు ప్రాధాన్యతనిస్తే బావుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. అడపా దడపా ఇకపై అతడు తన వయసుకు తగ్గ పాత్రల్ని చేసినా అది ఎంతో బావుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఇంతకీ నమ్రత- మహేష్ మైండ్ లో ఏం ఉందో తెలియదు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ పూర్తయ్యే వరకూ ఎలాంటి నిర్ణయం ఉండదా? అన్నదానికి లవ్ లీ స్టార్ కపుల్ సమాధానమివ్వాల్సి ఉంది.

మహేష్ బర్త్ డే సందర్భంగా నమ్రత ఎమోషనల్ నోట్ కూడా ఇంతకుముందు వైరల్ అయ్యింది. ``నువ్వు నా ప్రపంచాన్ని దివ్వెలా వెలిగించావు! హ్యాపీ బర్త్ డే MB!! మరెన్నో సంవత్సరాలు సంతోషంగా!! నిన్ను ప్రేమిస్తున్నాను.. ఇప్పుడు .. ఎల్లప్పుడూ`` అంటూ తన ప్రేమను కురిపించారు.

టాలీవుడ్ లోని ఆదర్శ జంటగా మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్ నిరంతరం అభిమానుల మనసుల్లో ఉన్నారు. నమ్రతా శిరోద్కర్ కి తన భర్త మహేష్ బాబుపై అన్యోన్యత అపారమైనది. ఇప్పుడు గౌతమ్ కూడా ఎంబీలా ఎదిగేస్తున్నాడు. దీంతో ఆ ఆనందం వర్ణించలేనిదిగా మారింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి - ఒక్కడు సినిమాల ప్రత్యేక ప్రదర్శనలతో అభిమానులు బోలెడంత సందడి చేసిన సంగతి తెలిసిందే.  MB ఫౌండేషన్ ద్వారా పిల్లల గుండె ఆపరేషన్లు పేద పిల్లల విద్యకు సహాయం చేయడానికి పోకిరి -ఒక్కడు స్పెషల్ షోల మొత్తం కలెక్షన్లను  విరాళంగా ఇవ్వాలని మహేష్- నమ్రత జంట నిర్ణయించుకున్నారు. మహేష్ బాబు త్వరలో SSMB28  సెట్స్ పైకి వెళతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని 2023 వేసవిలో సినిమా హాళ్లలో విడుదల చేస్తారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో పాన్-ఇండియా సినిమాలోనూ మహేష్ నటిస్తారు.

రాజమౌళి గారితో ఒక్క సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు తీసినట్లే. ఇది శారీరకంగా చాలా మార్పును డిమాండ్ చేస్తుంది. నేను అందుకు నిజంగా సంతోషంగా ఉన్నాను.. ఇది పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. మేము అనేక అడ్డంకులను అధిగమించి మా సినిమాని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకువెళతామని  ఆశిస్తున్నాను అని మహేష్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×