నిఖిల్ కార్తికేయ 2 కోసం అంతా వేయిటింగ్!

సినీ ఇండస్ట్రీలో అప్పడప్పుడు వింతలు విడ్డూరాలు జరుగుతూ వుంటాయి. ఒక సినిమాని ఆపేసి ముందు కెళ్లాలని చాలా మంచి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ ప్రయత్నంలో పోటీలో వున్న సినిమాని కావాలనే తొక్కేస్తుంటాయి. కానీ థియేటర్లోలకి వచ్చే సరికి దిమ్మదిరిగే ఫలితం ఎదురై షాక్ కు గురవుతుంటారు. ఈ మధ్య విడుదలైన రెండు సినిమాల పరిస్థితి అలాగే మారింది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. జూలై 22న విడుదల కావాల్సిన ఈ మూవీకి అడుగడుగున్నా అడ్డంకులే ఎదురవుతున్నాయి. జూలై 22న రిలీజ్ అనుకుంటే అదే టైమ్ లో నాగచైతన్య `థాంక్యూ` రిలీజ్ వుందని వాయిదా వేసుకోమన్నారట.

దిల్ రాజు చెప్పడంతో `కార్తికేయ 2`ని ఆగస్టు 12కు మార్చేశారు. తమాషా ఏంటంటే `కార్తికేయ 2`ని వాయిదా వేసుకోమని జూలై 22న విడుదలైన `థాంక్యూ` బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసి షాకిచ్చింది.

ఇక `కార్తికేయ 2`ని ఆగస్టు 12న రిలీజ్ అని ప్రకటిస్తే ఆ డేట్ కూడా అప్పుడే ఫైనల్ చేయకూడదని కూడా కొంత మంది వెనక్కి వెళ్లమన్నారని హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 12న మా సినిమా ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ అవుతుందని హీరో నిఖిల్ స్పష్టం చేసినా చివరి నిమిషంలో రిలీజ్ డేట్ ని మళ్లీ మార్చుకోవాల్సి వచ్చింది.

ఆగస్టు 12న నితిన్ `మాచర్ల నియోజక వర్గం` రిలీజ్ అవుతున్న నేపథ్యంలో క్లాష్ కాకూడదని మళ్లీ నిఖిల్ `కార్తికేయ 2`ని వెనక్కి వెళ్లమన్నారట. దీంతో చేసేది లేక ఒక్క రోజు ఆలస్యంగా ఆగస్టు 13న తన సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. మరి కొన్ని గంటల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక ఆగస్టు 12న విడుదలైన నితిన్ `మాచర్ల నియోజక వర్గం` నిరాశపరచడంతో 13న రానున్న నిఖిల్ సినిమాపై ఇప్పడు అందరి దృష్టిపడింది.

నిఖిల్ సినిమాని ఆపేసి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిన సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా నిలవడంతో నిఖిల్ `కార్తికేయ 2` పై పాజిటివ్ వైబ్ మొదలైంది. అంతే కాకుండా నిఖిల్ సపోర్టర్స్ ఎలాగైనా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని భారీ వసూళ్లని రాబట్టాలని కోరుకుంటున్నారట. నిఖిల్ సపోర్టర్స్ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×