మాలీవుడ్ లో బన్నీ రేంజ్ పెంచిన దుల్కార్!

మాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి మాలీవుడ్ లో ఫేమస్ అయిన ఏకైక స్టార్ బన్నీ. అక్కడ బన్నీకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ తరహాలో మలయాళంలోనూ పేరు తెచ్చుకోవాలని పలువురు హీరోలు ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు.

బన్నీ తమకెంతో?  ప్రత్యేకమని సందర్భం వచ్చిన ప్రతీసారి అక్కడ అభిమానులు చాటుతూనే ఉన్నారు. స్టైలిష్ స్టార్ నటించిన సినిమాలన్నీ దాదాపు మాలీవుడ్ లో రిలీజ్ అవుతుంటాయి. అక్కడ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి. మాలీవుడ్ లో హ్యూజ్ మార్కెట్ కల్గిన తెలుగు స్టార్ అతను. కేవలం అనువాద సినిమాలతోనే ఇదంతా సాధించగలిగాడు.

స్ర్టెయిట్ సినిమా చేస్తే బన్నీ క్రేజ్ అంతకంకతకు  రెట్టింపు అవ్వడం ఖాయం.  తాజాగా బన్నీ మాలీవుడ్ క్రేజ్ గురించి అక్కడి సూపర్ హీరో దుల్కార్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ దుల్కార్ ఏమన్నారంటే? `` కేరళలో అల్లు అర్జున్ పెద్ద స్టార్.  అంతేకాదు కీలకమైన తరుణంలో మలయాళం సినిమా స్పాన్ ని పెంచారు.

మలయాళ సినిమా ప్రధానంగా సీనియర్ స్టార్స్తో నడుస్తోన్న సమయంలో అతను అక్కడ ఎంట్రీ ఇచ్చారు.  యువ రక్తాన్ని ప్రోత్సహించడానికి మా  ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని నిరూపించిన యంగ్ స్టార్ అతనే. అల్లు అర్జున్ ఇప్పటి యంగ్ జనరేషన్ మలయాళీ తారలకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఎందుకంటే యువ తారలు పరిశ్రమలో పెద్ద ఎత్తున రాణించగలరని బన్నీ నిరూపించారు.

సీనియర్ స్టార్లు పాలిస్తున్న రోజుల్లోనే ఆయన ఎంట్ర ఇచ్చి సక్సెస్ అయ్యారు.  ఇంత వరకూ  అల్లు అర్జున్  స్ట్రెయిట్ మలయాళీ సినిమా చేయలేదు.  కానీ మల్లు సినిమాపై అతని ప్రభావం కచ్చితంగా ఉంటుందని` నమ్ముతాను అని అన్నారు. దుల్కార్ సల్మాన్ వ్యాఖ్యలతో బన్నీ స్థాయి మరింత పెరిగిందని చెప్పొచ్చు.

మమ్ముట్టి వారసుడిగా దుల్కార్ మాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అటుపై ట్యాలెంట్ తో స్టార్ గా ప్రూవ్ చేసుకున్నారు. మోహన్ లాల్ లాల్..పృథ్వీ రాజ్ సుకుమారన్ ..బిజు మీనన్..మమ్ముట్టి  లాంటి స్టార్లతో పోటీగా సినిమాలు చేస్తున్నారు.  `సీతారామం`తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో దుల్కార్ క్రేజ్  రెట్టింపు అవుతుంది. కొత్త ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇంకా ఎలాంటి సైన్  చేయలేదుగానీ బడా సంస్థలు వెంటపడుతున్నట్లు సమాచారం.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×