ఐటీడీపీ అంటే బ్లూఫిలింలు తయారు చేసే కంపెనీ.. కొడాలి తీవ్ర వ్యాఖ్య

మాజీ మంత్రి.. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నోటి నుంచి మాటలు ఎలా వస్తాయి? ఆయన తీరు ఎలా ఉంటుంది? అన్న విషయాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తనకు తోచింది అనేయటం.. దానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్నిఆయన అస్సలు పట్టించుకోకపోవటం తెలిసిందే. అంతేకాదు.. ఏపీ రాజకీయాల్లో మర్యాద.. సంస్కారం లాంటి పదాలు మిస్ అయ్యేలా చేసిన ఘనతకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వారిలో ఆయన ఒకరుగా చెబుతుంటారు.

విపక్షంలో ఉన్నప్పుడు లోకేశ్ ను ఉద్దేశించి ఎంత దారుణ వ్యాఖ్యలు కొడాలి నాని నోటి నుంచి వచ్చాయో తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి.. ఎన్నెన్ని మాటలు అన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

రాజకీయాల్లో సవాలచ్చ ఉండొచ్చు.కానీ.. కనీస మర్యాద లేకుండా మాట్లాడే కొత్త కల్చర్ కు కొడాలి బ్రాండ్ అంబాసిడర్ గా మారారన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీ అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోలకు సంబంధించిన అంశంపై తాజాగా ఆయన స్పందించారు.

ఎప్పటిలానే తనకు వచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐటీడీపీ అంటే బ్లూఫిలింలు తయారు చేసే కంపెనీగా అభివర్ణించిన కొడాలి నాని.. దానికి నిర్మాత చంద్రబాబునాయుడని.. దర్శకత్వం పప్పు నాయుడన్నారు. ‘ఈ కంపెనీ ద్వారా ఒకరి ముఖాలకు వేరే వారి బాడీలు తొడుగుతున్నారు.

తమ మీడియా సంస్థల ద్వారా వాటిని ప్రచారం చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో వారు చేసిన అ్లలరి అంతా ఇంతా కాదు. ఎంపీ గోరంట్ల మాధవ్ నెత్తి నోరు కొట్టుకొని అది నాది కాదు అంటే..అది నీదేనంటూ పచ్చ మీడియా.. టీడీపీ నేతలు బురద జల్లుతున్నారు’ అంటూ మండిపడ్డారు.

తెలుగు దేశం పార్టీ ఇమేజ్ రాష్ట్రంలో రోజురోజుకు తగ్గిపోవటంతో అధికార పక్షం మీద ఏదోలా బురద జల్లాలనే ఉద్దేశంతోనే బ్లూఫిలింల సమస్యను తెర మీదకు తెచ్చారన్నారు. ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా వైఎస్ జగన్ పాలన చేస్తుంటే.. చంద్రబాబు అండ్ కో కు పనులు లేకుండా పోయినట్లు మండిపడ్డారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఐటీడీపీ అంటే బ్లూ ఫిలిం కంపెనీ అయితే..అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఆ సంస్థపై కేసులు పెట్టి.. తగిన ఆధారాలతో వారిపై చట్ట బద్ధంగా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదన్న పలువురి సందేహాలకు కొడాలి నాని ఎప్పుడు సమాధానం చెబుతారో?
× RELATED వైసీపీ నోట అమరావతి మాట...మార్చిందెవరు...?
×