మునుగోడు ఉప ఎన్నికలపై వెంకట రెడ్డి కీలక వ్యాఖ్య

నిత్యం ఏదో ఒక రచ్చతో అటు పార్టీని.. టీపీసీసీ చీఫ్ ను ప్రశాంతంగా నిద్ర పోనివ్వకుండా చేయటంలో సీనియర్ నేత కమ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాతే ఎవరైనా చెప్పాలి.  

తరచూఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే ఆయన ఎజెండాలో కీలకం.. తెలంగాణ కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచి.. ఈ రోజున రాష్ట్రంలో పార్టీ తన ఉనికిని చాటుతుందంటే దానికి కారణం.. రేవంత్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. అయితే.. రేవంత్ అంటే అస్సలు పడని వెంకటరెడ్డి.. ఫైర్ బ్రాండ్ రేవంత్ కు పేరు వచ్చే ఏ పనికి తాను సాయంగా నిలవకపోవటం మొదట్నించి వస్తున్నదే.

తాజాగా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేసే అడుగులు.. చెప్పే మాటలు ఏ రీతిలో ఉంటాయన్న దానిపై బోలెడంత సస్పెన్ష్ నెలకొంది. ఉప ఎన్నికకు కారణమైన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్న వేళ.. ఆయన ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారా? అన్న సందేహం ఉంది.

ఇలాంటి వేళ.. అలాంటి సందేహాలకు సెలవిస్తూ.. తాను కొద్ది రోజుల పాటు ఏ అంశాన్ని పట్టించుకోనని.. మునుగోడు ఉప ఎన్నిక ఇష్యూకు దూరంగా ఉంటానంటూకీలక వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది.

మొత్తంగా చూస్తే.. ఏదో రకంగా రేవంత్ కు ఇబ్బందికి గురి అయ్యేలా కోమటిరెడ్డి ప్లానింగ్ చేస్తారన్న అభిప్రాయానికి తగ్గట్లే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య ఉందని చెప్పాలి. ఓవైపు సొంత తమ్ముడు.. మరోవైపు రాజకీయంగా తమ ఉనికిని కాపాడేందుకు అండగానిలిచిన కాంగ్రెస్ ను వదిలేయటానికే ఆయన మక్కువ చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ తన తమ్ముడికి ప్రచారాన్నిచేయాల్సి వచ్చినా చేయలేని తీరుకు కావాల్సినంత మర్యాద పొందటం ఖాయమటున్నారు. తమ్ముడు రాజగోపా్ బూచి చూపించి కోమటిరెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఇంకో మాట కూడా వినిపిస్తోంది. తమ్ముడు పేరు చెప్పిన వెంకటరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బ్యాచ్ కు ఎక్కడో ఒక చోట ఎర్త్ పెట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
× RELATED వైసీపీ నోట అమరావతి మాట...మార్చిందెవరు...?
×