మహేష్ తో సూపర్ హిట్ కొట్టినా వెయిటింగ్ తప్పలేదు పాపం..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఓవరాల్ గా సర్కారు వారి పాట సినిమాకు గాను పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తప్పకుండా దర్శకుడు పరశురామ్ ఇక బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరిగింది.

సర్కారు వారి పాట సినిమా సక్సెస్ అనేది పరశురామ్ కెరీర్ దూసుకు పోయేలా ఏమీ చేయలేక పోయింది అనేది తాజా టాక్. సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి చాలా నెలలు అయ్యింది.

ఇప్పటి వరకు పరశురామ్ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి వరకు నాగ చైతన్య తో పరశురామ్ సినిమా ఉంటుందని అంతా భావించారు.

కానీ ఇప్పటి వరకు చైతూ కానీ.. పరశురామ్ కానీ ఆ సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో ఆ సినిమాపై అనుమానాలు ఉన్నాయి. పైగా ప్రస్తుతం నాగ చైతన్య ధూత అనే వెబ్ సిరీస్ ను చేయడంతో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా ను నాగ చైతన్య చేస్తున్నాడు. సరే వెంకట్ ప్రభు సినిమా తర్వాత అయిన పరశురామ్ సినిమా చేస్తాడు అంటే అది కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.

తాజాగా డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే ఏడాది లో చైతూ డీజే టిల్లు దర్శకుడితో సినిమాను మొదలు పెట్టబోతున్నాడట. అంటే వచ్చే ఏడాది వరకు నాగ చైతన్య ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. అంటే అప్పటి వరకు పరశురామ్ వెయిట్ చేయాల్సిందే అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

గీత గోవిందం తర్వాత నాగ చైతన్య తో పరశురామ్ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కాని మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కు ఆఫర్ రావడంతో పరశురామ్ అటు షిప్ట్ అయ్యి చైతూ సినిమా ను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ పరశురామ్ ను హోల్డ్ లో పెడుతున్నాడు.
× RELATED 'పోకిరి' లానే 'జల్సా' 4కే వెర్షన్ రెడీ
×