నందమూరి వారికి కలిసొస్తున్న పాప సెంటిమెంట్!

టాలీవుడ్ లో సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటారు. ఏ సినిమా మొదలు పెట్టినా ముహూర్తం నుంచి గుమ్మడి కాయ కొట్టేంత వరకు సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయ్యేంత వరకు సెంటిమెంట్ లు ఫాలో అవుతూ వుంటారు.

అయితే నందమూరి హీరోలు మాత్రం పాప సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. బాలకృష్ణ నటించిన `అఖండ` కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `RRR` మూవీ కి చిన్న పాప సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఇదే తరహాలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన `బింబిసార` మూవీకి కూడా పాప సెంటిమెంట్ కలిసి రావడం విశేషం.

వివారల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ` మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్నిసొంతం చేసుకుంది. సినిమా సెకండ్ హాఫ్.. బాలయ్య అఖండ క్యారెక్టర్ ఎంట్రీకి చిన్న పాప క్యారెక్టర్ ప్రధాన హైలైట్ గా నిలిచి సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసింది. పాప సెంటిమెంట కారణంగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ చేరువ కావడమే కాకుండా పాప సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని బాలయ్యని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

ఇక ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన `RRR` కూడా పాప సెంటిమెంట్ ప్రధానంగా సాగిన విషయం తెలిసిందే. మల్లి అనే పాపని బ్రిటీష్ గవర్నర్ తన వైఫ్ కోసం తీసుకెళ్లి బంధించడంతో ఆ పాపని విడిపించడానికి భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఫైట్ చేయడం.. రామ్ చరణ్ పాత్రని కలవడం తెలిసిందే. పాప ప్రధానంగా సాగిన ఈ మూవీ కూడా పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సాధించిన ఎన్టీఆర్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది.

ఇప్పడు ఇదే సెంటిమెంట్ నందమూరి కల్యాణ్ రామ్ కు కూడా ప్లస్ గా మారడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అఖండలో తమ్ముడి కూతురు ప్రాణాలని కాపాడటం కోసం సినిమా సాగితే .. `RRR`లో బ్రిటీషర్ల చెర నుంచి మల్లి అనే పాపని విడిపించడం కోసం సాగింది. ఇదే తరహాలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన `బింబిసార`లోనూ ఓ పాప పాత్ర నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఆ పాప క్యారెక్టరే ఈ మూవీ విజయానికి సెంటిమెంట్ గా మారిందని అంటున్నారు.

పందమూరి కల్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ `బింబిసార`. 5వ శతాబ్దం నుంచి నేటి అధునిక ప్రపంచంలోకి మాయా దర్పం (అద్దం) ద్వారా వచ్చిన బింబిసారుడు ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన కథా కథనాలతో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 5న శుక్రవారం విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా వశిష్ట దర్శకుడిగా పరిచయం కాగా కేథరిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.
× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×