పోరీ సూపరో..నితిన్బేబమ్మ అదరగొట్టేశారు

హీరో నితిన్ న‌టించిన హై వోల్టేజ్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఎడిట‌ర్ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నితిన్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ ఆగ‌స్టు 12న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.

తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ ఆ అంచ‌నాల్ని మ‌రో స్థాయికి చేర్చి సినిమాపై భారీ బ‌జ్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్ర‌య‌త్నించిన `కార్తికేయ 2` ఒక రోజు వెన‌క్కి వెళ్ల‌డంతో నితిన్ `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`తో సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి పోటీ లేకుండా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. దీంతో ఈ మూవీపై స‌హ‌జంగానే మాస్ ఆడియ‌న్స్‌లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ మూవీలో హీరో నితిన్ ఐఏఎస్ అధికారిక‌గా మాచ‌ర్ల నియోజ‌క వర్గం క‌లెక్ట‌ర్ గా కనిపించ‌బోతున్నాడు. క‌లెక్ట‌ర్ అంటే క్లాస్ గా వుంటాడు కానీ ఈ మూవీలో నితిన్ ఊర‌మాస్ పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించ‌బోతున్నాడు.

స‌ముద్ర‌ఖ‌ని విల‌న్ గా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ వీడియోల‌తో పాటు లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. తాజాగా కృతిశెట్టి, నితిన్ ల క‌యిక‌లో రూపొందిన `పోరీ సూప‌రో య‌యితు వండ‌రో..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని శ‌నివారం విడుద‌ల చేసింది.

కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించ‌గా మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్,  రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆల‌పించారు. పాట‌లో నితిన్, బేబ‌మ్మ స్టైలిష్ డ్యాన్స్ స్టెప్పుల‌తో దుమ్ముదులిపేశారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఇక వల్ల‌రే వ‌ల్లారే...వ‌ల్లె వ‌ల్లె వ‌ల్లారే.. అంటూ వ‌చ్చే చ‌ర‌ణంలో నితిన్ వేసిన ఫ్లోర్ స్టెప్ అదిరిపోయింది. మ‌హితి స్వ‌ర‌సాగ‌ర్ బీట్ కి.. రాహుల్ సిప్లిగంజ్ స్పీడుకి త‌గ్గ‌ట్టుగా డ్యాన్స్ స్టెప్పుల‌తో నితిన్ అద‌ర‌గొట్టేశాడు. ఈ పాట థియేట‌ర్ల‌లో నితిన్ ఫ్యాన్స్ చేత స్టెప్పులేయించ‌డం ఖాయం.

ఇదిలా వుంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆగ‌స్టు 7న హైద‌రాబాద్ లో ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చ‌క చ‌క జ‌రిగిపోతున్నాయి. ఈ భారీ ఈవెంట్ తోమాసీవ్ సెల‌బ్రేష‌న్స్ షురూ అంటూ చిత్ర బృందం స్ప‌ష్టం చేస్తోంది. అంటే రిలీజ్ కు ఐదు రోజుల‌ ముందుగానే `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` సెల‌బ్రేష‌న్స్ ఓ రేంజ్ లో మొద‌లు కానున్నాయ‌న్నమాట‌.

 
 

× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×