ఎన్నికల ఊసే లేదు... జగన్ 2024 కేబినెట్ కి పేర్లు రెడీ అంట!

రాబోయే ఎన్నికలు ఎలా ఉండనున్నాయో ఏమో కానీ అప్పుడే ఇద్దరు నాయకులకు సంబంధించి బెర్తులు కన్ఫం చేశారు సీఎం  జగన్. వారిలో ఒకరు ఎమ్మెల్సీ భరత్  (కుప్పం నియోజకవర్గ అభ్యర్థి) మరొకరు కంబాల జోగులు (రాజాం ఎమ్మెల్యే విభజిత విజయనగరం జిల్లా ఎమ్మెల్యే)  ఉన్నారు.

అంటే కీలక స్థానాలకు సంబంధించి గెలుపు ఓటములు నిర్ణయం కాకమునుపే సీఎం జగన్ తనదైన ప్రకటనలు చేస్తున్నారు. రాజాంలో ఈ సారి వైసీపీ గెలుపు అంత సులువు కాదని తేలిపోయిందా ప్రత్యర్థి పార్టీల  దాడి నుంచి..ధాటి నుంచి..తప్పుకోవడం అంత సులువు కాదని తేలిపోయిందా అన్న అనుమానాలో సందేహాలో వినవస్తున్నాయి.

ఈ నేపథ్యాన  ఈ సారి జోగులును గెలిపిస్తే మంత్రి చేస్తానని  చెప్పారా..అంటే జగన్ 3.0 అప్పుడే ఫిక్స్ అయిపోయిందా అన్న వాదన కూడా వినిపిస్తుంది.  ఇదే సమయంలో టీడీపీ తరఫున బరిలో దిగే అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. రాజాం ఎస్సీ  నియోజకవర్గం కావడంతో కోండ్రు మురళి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆయనకు పోటీగా సీన్లోకి కావలి గ్రీష్మ అనే రాజకీయ  వారసురాలు కాస్త పరిణితి ఉన్న యువ నాయకురాలు వస్తున్నారని తెలుస్తోంది. మహానాడు వేదికగా కూడా ఆమె కాస్త  శ్రుతి మించి మాట్లాడినా అందుకు కూడా కొన్ని కారణాలున్నాయన్న   అభిప్రాయం ఒకటి ఆమె మద్దతుదారుల నుంచి వినిపించింది.

అప్పటిదాకా వైసీపీ శ్రేణులు పలు డిబేట్లలో (వివిధ ఛానెళ్లలో నిర్వహించే  ప్యానెల్ డిస్కషన్లలో)  నోటికి  ఎంత మాట వస్తే అం త మాట అన్నారు అని అందుకే ఆమె ఆ విధంగా స్పందించారని అంటున్నారు టీడీపీ శ్రేణులు. అయితే ఆ ఘటన తరువాత ఆమె కొన్ని సందర్భాల్లో వైసీపీ లీడర్లను ఉద్దేశించి కన్నీటి పర్యంతం అయి మాట్లాడినా కూడా అధికార పార్టీ నాయకులకు అస్సలు కనికరం అన్నది లేకుండా పోయిందని అంటున్నాయి టీడీపీ శ్రేణులు.అందుకే మహానాడు వేదికగా ఆమె ఆ విధంగా స్పందించి ఉంటారని ఏదేమయినప్పటికీ ఆ ఒక్క ఘటనతో తమ నాయకురాలికి రాష్ట్ర స్థాయిలోనే కాదు  ప్రవాసాంధ్రుల దగ్గర కూడా మంచి గుర్తింపే దక్కిందని అంటున్నారు.

అందుకే ఆమెకు టికెట్ ఇస్తారని కూడా అంటున్నారు.అంతేకాదు  వరుసగా రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ కంబాల జోగులు చేసిందేమీ లేదని తేలిపోయిందని వారు చెబుతున్నారు.ఈ తరుణాన గ్రీష్మను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. కోండ్రుకు  ఛాన్స్ లేదని కూడా తెలుస్తోంది. ఈ దశలో  అధినేత చంద్రబాబు తనదైన శైలిలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఏదేమయినప్పటికీ క్లిష్టం అనిపించే స్థానాలకు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న కార్యకర్తలు మాత్రం అభ్యర్థి ఎవ్వరైనా 4  అభివృద్ధి పనులు ఉంటేనే గెలుపు సాధ్యమని  అంటున్నారు. రానున్న క్యాబినెట్ కు సంబంధించి మంత్రి పదవుల గురించి ఇప్పటి నుంచే కన్నా ముందు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుదలే ముఖ్యం అని  వీరంతా అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
× RELATED తెలంగాణాలో టీడీపీ రీ ఎంట్రీ ... అక్కడ నుంచేనట...
×