దాగుడు మూతల బేరం..మృత్యువుతో యవ్వారం..

ప్రియాంక శర్మ శివ ఆలపాటి జంటగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ `డై హార్డ్ ఫ్యాన్`. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బి. చంద్రప్రియ సుబూధి నిర్మిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ అభిరామ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

షకలక శంకర్ నోయెల్ సేన్ రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఓ హీరోయిన్ కు అభిమానికి మధ్య సాగే ఆసక్తికర కథతో సస్పెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు.  

ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా పరుగో పరుగు అంటూ సాగే లిరికల్ వీడియోని శనివారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటకు మధు పొన్నాస్ సంగీతం అందించారు. పృథ్విచంద్ర ఆలపించారు. మూవీ కాన్సెప్ట్ ని ప్రతిబింబిస్తూ సాగే ఈ పాట సీరియస్ టోన్ లో సాగుతూ ఆకట్టుకుంటోంది.

సినిమాల్లో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరోయిన్ ని కలవాలనుకుంటాడు.

అనుకోకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సినిమాలోని అన్ని పాత్రలు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి. ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ మూవీని రూపొందించారు. కథలో మలుపులు థ్రిల్ చేస్తాయిని చిత్ర బృందం చెబుతోంది.

ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ మూవీని చాలా పక్కగా క్వాలిటీతో నిర్మించామని నిర్మాత చంద్ర ప్రియ సుబూధి చెబుతున్నారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా నిర్మించామని షూటింగ్ పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది.


× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×