'పొలిటికల్ ఫైర్' పై బండి పాఠాలు.. మాటలు హద్దు మీరొద్దట!

రాజకీయ భాష గురించి.. నాయకులు ఉపయోగించే వ్యాఖ్యల గురించి.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్.. పాఠాలు చెప్పారు. భాష హద్దులు మీరితే.. ప్రజలు సహించరట.. అయితే.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు నవ్వుతున్నారు.

ఎందుకంటే.. అసలు.. హద్దులు దాటిందే బండి కాబట్టి.. సరే.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..  బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ను కలిసిన బండి దాసోజు శ్రవణ్... ఇది సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. విద్యార్థి పరిషత్‌లో పనిచేసిన శ్రవణ్.. తనతో భేటి అవడం హర్షణీయమన్నారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించామని తెలిపారు.

తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని పేర్కొన్నారు. కానీ భాష హద్దు మీరితే ప్రజలు సహించరని వెల్లడించారు. కేసీఆర్ ఆయన కుటుంబం మాట్లాడే భాష చూసి.. దేశం మొత్తం అసహించుకుంటుందని బండి అభిప్రాయపడ్డారు.

చిల్లర రాజకీయాలు చేస్తూ... చిల్లర కుటుంబంగా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా అసహ్యించుకుంటున్నారో.. దాన్ని చూసైనా మిగతా రాజకీయ పార్టీల వాళ్లు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.

ఇక రాజగోపాల్‌రెడ్డి కొత్త కాంట్రాక్టర్ ఏమి కాదని... ఆయనే స్వయంగా తనో కాంట్రాక్టర్ అని ఒప్పుకున్నట్లు గుర్తు చేశారు. అయితే బీజేపీకి డబ్బులిచ్చి.. నాయకులను చేర్చుకునే సంస్కృతి తమకు లేదని స్పష్టం చేశారు. ఆ అలవాటు టీఆర్ ఎస్ కాంగ్రెస్‌లకు ఉంటాయని ఆరోపించారు.

``కేసీఆర్ సోనియాను తిట్టినవాళ్లే... కాంగ్రెస్ పార్టీలో నాయకులు అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి చేరితే తప్పేంటి? అయితే వెంకట్‌రెడ్డి చేరుతారో లేదో .. ఆయన్నే అడిగి చెప్తా... దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశారు. కానీ సరైన ఫలితం ఆయనకు దక్కలేదు. విద్యార్థి స్థాయి నుంచి ఆయన కష్టపడి వచ్చారు. ఆయన ఎప్పుడు చేరుతారో త్వరలో ప్రకటిస్తాం.`` అని బండి వ్యాఖ్యానించారు.

టీఆర్ ఎస్‌కు గుడ్‌బై!

ప్రజల ఆశలను టీఆర్ ఎస్ ప్రభుత్వం వమ్ము చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ ఎస్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పనున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే చెప్తోందని అన్నారు. బీజేపీలో చేరే వాళ్ల సంఖ్య పెద్దది.. ఇది ట్రైలర్ మాత్రమే... సినిమా ముందుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
× RELATED నేనే పెద్ద తోపు...కాంగ్రెస్ అంటే కోమటి రెడ్డి ఒక్కడేనా .?
×