బ్రాండింగ్స్ లో మహేష్ కి పోటీగా బన్నీ..విజయ్!

టాలీవుడ్ స్టార్ హీరోలందరిలో  సూపర్ స్టార్ మహేష్ బ్రాండింగ్ ఎండార్స్ మెంట్ ఎంతో ప్రత్యేకమైనవి. ఎండార్స్ చేయడంలో సూపర్ స్టార్ అంత బిజీగా ఏ నటుడు ఉండడు. ప్రఖ్యాత కంపెనీ బ్రాండ్ లు అన్నింటిని ప్రమోట్ చేయడంలో మహేష్ ముందుంటారు. వాటి ద్వారానే కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు.

టాలీవుడ్ లో ఒక్క సూపర్ స్టార్ కి మాత్రమే తెలిసిన టెక్నిక్. మహేష్ రేంజ్ అవకాశాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వచ్చాయి గానీ ఆయన ఇలాంటివి చేయరు. కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా పవన్ ఇంత వరకూ ఎండార్స్ మెంట్ వైపు చూసింది లేదు. ఆ మధ్య ఓ ప్రఖ్యాత కంపెనీ ఓ యాడ్ లో నటిస్తే ఏకంగా 70 కోట్లు ఇస్తామని ముందుకొచ్చింది.

కానీ పవన్ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. యాడ్స్ చేయడం ఇష్టముండదని..అందుకే అలాంటి వాటిలో నటించనని చెబుతుంటాయరాయన. ఆ రకంగా పలు బ్రాండింగ్ సంస్థలు మరో ఆప్షన్ లేక మహష్ వద్దకు వెళ్లిపోయాయి.  పవన్ రిజెక్ట్ చేసినా చాలా కంపెనీల్ని మహేష్ ఇండార్స్ చేసారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి నటులు ఇప్పటికే కొన్ని యాడ్స్ చేసారు.

`ఆర్ ఆర్ ఆర్` సినిమాతో ఇద్దరు పాన్ ఇండియా నటులయ్యారు.  కానీ వాళ్లు యాడ్స్ పై అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. అలాగే ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిన  దగ్గర నుంచి ఇలాంటి అవకాశాలు చాలానే వచ్చాయి. కానీ  ఆయనా చేయలేదు. మరి బ్రాండింగ్స్ విషయంలో భవిష్యత్ లో  మహేష్ కి పోటీగా నిలిచేది ఎవరంటే?  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తున్నాయి.

`పుష్ప` సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత బన్నీ ఎండార్స్ మెంట్ వేగం మరింత పెరిగింది. ఈ ఏడు నెలల కాలంలోనే  వివిధ కంపెనీ యాడ్స్ షూట్స్ లో పాల్గొన్నారు. వీటికి తెలుగు చిత్రాల దర్శకులే పనిచేసారు. అంతకు ముందు బన్నీ చాలా యాడ్స్ చేసాడు. ఇక  విజయ్ దేవరకొండ కూడా వచ్చిన  ఏ యాడ్ ని విడిచిపెట్టడం లేదు.

ఉన్న క్రేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. `ఫేం` ఉన్నంత కాలమే హవా అన్నది గుర్తించి యాడ్స్  ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. `లైగర్` సినిమా హిట్ అయితే  పాన్ ఇండియాలో ఫేమస్ అవుతాడు.  స్టార్ గా యంగ్ హీరో క్రేజ్ రెట్టింపు అవుతుంది. అటుపై మరిన్ని బ్రాండింగ్స్  ఖాయం. అలాగే బన్నీ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా మహేష్ వేగాన్ని అందుకోవాలంటే ఈ స్టార్లు ఇద్దరికీ ఇంకొంచెం సమయం పడుతుంది.
× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×