బాబు ల్యాండ్ అయ్యాడు..కానీ వేట ఆలస్యమే!

సూపర్ స్టార్ మహేష్ ఫారిన్ టూర్ ముగింది. ఫ్యామిలీతో కొన్ని రోజులు పాట ఫారిన్ చెక్కేసిన మహేష్ ఇండస్ర్టీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులు  విదేశాల్లోనే ఉండే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అందరి అంచనాల్ని తల్లకిందులు చేసి షాక్ ఇచ్చారు. అనూహ్యంగా హైదరాబాద్ లో ప్రత్యక్షమై అదేంటి మహేష్ అప్పుడే వచ్చేసారు? అనిపించుకుంంటున్నారు.

అవును. ఇప్పుడిదే అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా నిర్మాణం బంద్ పెట్టిన సంగతి తెలిసిందే. హీరోల భారీ పారితోషికాలు కారణంగా బంద్ కొనసాగుతోంది. ఇది ఆరవ రోజు. దీంతో దాదాపు అగ్ర హీరోల సినిమా షూటింగ్ లు అన్ని ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. హీరోలతో నిర్మాతలు సంప్రదింపులు...చర్చలు నడుపుతున్నారు.

వీలైనంత త్వరగా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నిర్మాతలంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది  హీరోలు ఈ బంద్ నే హాలీడే గా మార్చేసుకుంటున్నారు. హీరోలు తమకిష్టమైన వెకేషన్ స్పాట్ కి చేరుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం అమెరికా టూర్ ముగించుకుని ఇండియాలో ల్యాండ్ అయ్యారు.

బంద్ నేపథ్యంలో మరికొన్ని రోజలు పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చినా....సూపర్ స్టార్ మాత్రం షాకిచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ సినిమా ప్రారంభం అవ్వడానికి ఛాన్స్ లేదు. రెగ్యులర్ షూటింగ్ లాంచ్ అవ్వాలంటే ఇంకొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.

అయితే ఈ గ్యాప్ లో మహేష్ స్ర్కిప్ట్ ని మరింత సానబెట్టించే అవకాశమైతే ఉంది. కథ విషయంలో మహేష్ కేరింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆషామాషీ స్ర్కిప్ట్ లతో అతన్ని లాక్ చేయడం అంత వీజీ కాదు. కథలో సమ్ థింగ్  ఉండాలని చూస్తారు. కమర్శియల్ సహా అన్ని కోణాల్లో సినిమా వర్కౌట్ అవుతుందంటేనే కమిట్ అవుతారు.

ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది కాబట్టి మళ్లీ అవన్నీ పునశ్చరణ చేసుకునే అవకాశం ఉంది. అలాగే నిర్మాతలతో పారితోషికం  విషయంలోనూ చర్చించాలి. ఇప్పటికే రామ్ చరణ్..బన్నీ..ఎన్టీఆర్ పారితోషికం తగ్గించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా చాలా మంది హీరోలు ముందుకు రావాలి. అందులోనూ మహేష్ లాంటి స్టార్ ఇంకా ముందుండాలి. ఇప్పటికే  బాగా ఆలస్యమైంది.  ఇలా  కొన్ని కారణాలుగానే మహేష్ ఫారిన్ టూర్ ముగించుకుని  వచ్చేసినట్లు తెలుస్తోంది.
× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×