'హలో వరల్డ్' ట్రైలర్ టాక్: అరుగురు స్నేహితుల కొత్త ప్రపంచం!

నిహారిక కొణిదెల పెళ్లి త‌రువాత కంప్లీట్ గా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. అయితే డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లో మాత్రం నిర్మాత‌గా త‌న‌దైన మార్కు వెబ్ డ్రామాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఇటీవ‌ల జీ5లో స్ట్రీమింగ్ అయిన `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` మంచి విజ‌యాన్ని అందించి నిర్మాత‌గా నిహారిక‌కు లాభాలు అందించింది. ఈ సిరీస్ అందించిన స‌క్సెస్ షోష్ తో వున్న నిహారిక తాజాగా మ‌రో వెబ్ డ్రామాని పూర్తి చేసింది.

అదే `హ‌లో వ‌ర‌ల్డ్‌`. ఈ సిరీస్ తో ఆర్య‌న్ రాజేష్‌, హీరోయిన్ సదా ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జ‌ల‌దంకి శివ‌సాయి వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఈ వెబ్ డ్రామాలో రామ్ నితిన్‌, న‌య‌న్ క‌రిష్మా, సుద‌ర్శ‌న్ గోవింద్‌, నిత్యాశెట్టి, నిఖిల్, అపూర్వ‌రావు, మై విలేజ్ షో అనిల్, స్నేహాల్‌, ర‌వివ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాష్ న‌టించారు. స్ట‌డీ పూర్తి కావ‌డంతో భిన్న‌మైన నేప‌థ్యాలున్న ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తారు. అనుకున్న‌ట్టే ఉద్యోగం వ‌స్తుంది. ఇక క‌ష్టాల‌న్నీ తీరిన‌ట్టే అనుకుంటారు.. కానీ అస‌లు క‌థ అక్క‌డి నుంచే మొద‌లైంద‌ని తెలుస్తుంది.

ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌దే `హ‌లో వ‌ర‌ల్డ్` అస‌లు క‌థ‌. ఆగ‌స్టు 12 నుంచి జీ5లో ఈ సీరిస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో శనివారం బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. టీమ్ కు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. సిద్ధార్ధ్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌గా, పైలెట్ గా, పోలీస్ ఆఫీస‌ర్ గా కావాల‌ని క‌ల‌లు కంటాడు కానీ చివ‌రికి సాఫ్ట్ వేర్ జాబ్ రావ‌డంతో సిటీకి వెళ్లిపోతాడు.

అదే త‌ర‌హాలో ఒక్కొక్క‌రు ఒక్కో క‌ల కంటారు కానీ చివ‌రికి సాఫ్ట్ వేర్ జాబే దిక్క‌వుతుంది. ఈ క్ర‌మంలో ఫ్రెష‌ర్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఐదురు త‌మ‌కిచ్చిన కోడ్ ల‌ని క్రాక్ చేశారా? అన్న‌దే మెయిన్ థీమ్‌.

సాఫ్ట్ వేర్ జాబ్ లో వుండ‌లేక.. తిరిగి ఇంటికి వెళ్ల‌లేక చాలాల‌ని ప్ర‌య‌త్నించి చివ‌రికి చావైనా బ్ర‌తుకైనా ఈ జాబ్ లోనే అని నిర్ణ‌యించుకున్న క్రేజీ బ్యాచ్ చివ‌రికి అనుకున్న‌ది సాధించారా? సాఫ్ట్ వేర్ వ‌రల్డ్ లో త‌మని తాము నిరూపించుకున్నారా? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో `హ‌లో వ‌ర‌ల్డ్` ని రూపొందించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

సాస్ట్ వేర్ ప్ర‌పంచంలో వుండే టార్గెట్ లు, వాటిని అధిగ‌మించ‌లేక ఎంప్లాయిస్ ప‌డే ఇబ్బందుల్ని ట్రైల‌ర్ లో ఆవిష్క‌రించారు. ఈ సిరీస్ తో కూడా నిహారిక మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 
 

× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×