వీడియో : ఆలియా అప్పుడే బేబీ బంప్..!

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్‌ లో యంగ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

సినీ ప్రముఖులు పలువురు హాజరు అయిన ఈ పెళ్లి వేడుక గురించి మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా వీరి పెళ్లి ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

పెళ్లి ఫోటోలు వైరల్‌ అవుతున్న సమయంలోనే ఆలియా మరియు రణ్‌బీర్ కపూర్ లు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో అంతా కూడా అవాక్కయ్యారు. హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తున్న ఆలియా భట్ గర్భం దాల్చడం ఏంటీ అంటూ చాలా మంది ముక్కున వేలేసుకున్నారు.

గర్భవతి అయినా కూడా ఆలియా కొన్నాళ్ల పాటు షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తాజాగా ఈ అమ్మడు బేబీ బంప్ తో కనిపించి అభిమానులకు మరింత నిరుత్సాహం కు గురి చేసింది. ఇటీవలే బేబీ బంప్ తో ఈ అమ్మడు ఈ వీడియోలో కనిపించింది.

ఇన్ స్టాగ్రామ్‌ లో ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్‌ మీడియా సంస్థ షేర్‌ చేసింది. ఆలియా అప్పుడే బేబీ బంప్ తో కనిపిస్తుంది. ఇక ఈమె సినిమాల్లో ఏం నటిస్తుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆలియా భట్ తల్లి కాబోతున్న విషయం తెలిసి ఎన్నో రోజులు కాలేదు.. అప్పుడే బేబీ బంప్ తో ఆలియా కనిపించడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆలియా సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఆమె అభిమానుల ప్రశ్న.

 
× RELATED గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
×