డోలో-650 కంపెనీకి షాకిచ్చిన కేంద్రం.. కోటీశ్వరుల కథ తవ్వేపనిలో ఐటీశాఖ

జ్వరం వచ్చిందంటే చాలు జనాలు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే వేసుకునే ట్యాబ్లెట్ డోలో-650. అంతగా ఈ జ్వర నివారణ మాత్ర జనాల్లోకి వెళ్లింది. ప్రతి సామాన్యుడికి డోలో-650 మాత్ర తెలుసు. కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుకు ప్రపంచదేశాలు మందులు కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో డోలో-650 మాత్రల పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.

డోలో-650 మాత్రలు వేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ప్రజలు తెగ వాడేశారు. వీటి అమ్మకాలు కోట్లలో సాగాయి. ప్రపంచదేశాలు సైతం డోలో-650 మాత్రలు ఎగుమతి చేసుకోవడానికి ఆ మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ మీద ఆధారపడ్డారు. అలాంటి డోలో -650మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ మీద ఐటీ శాఖ అధికారుల దాడులు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

బెంగళూరులో ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అధినేతలు దిలీప్ సురానా ఆనంద్ సురానా ఈరోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.  దేశంలోనే 94వ స్థానంలో ఉన్నారు.  ఆదాయపు పన్ను ఎగబెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతోపాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

కరోనా వైరస్ విరుగుడుకు ప్రపంచదేశాలు మందులు కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో డోలో-650 మాత్రలు మార్మోగిపోయాయి. డోలో-650 మాత్రలు వేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ప్రజలు అప్పట్లో ఆ మాత్రలను విపరీతంగా వాడేశారు.

కరోనా సమయంలో అత్యధికంగా సుమారు 350 కోట్లకు పైగా డోలో-650 మాత్రల పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సంవత్సరంలో మైక్రో ల్యాబ్స్ కంపెనీకి ఏకంగా రూ.450 కోట్లకు పైగా వ్యాపారం చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

భారత్ లోని 17 మందుల తయారీ కంపెనీల్లో డోలో కంపెనీ భారీ లాభాలు సొంతం చేసుకుందట..ట్యాక్స్ భారీగా ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్ర ఐటీ శాఖ బెంగళూరుతోపాటు చెన్నై తమిళనాడు గోవా పంజాబ్ సిక్కీం తదితర 40 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు జరిపి పరిశీలిస్తున్నారు.
× RELATED ఏపీ ప్రజలకు మరో బాదుడు తెచ్చిన జగన్ సర్కార్?
×