శభాష్ నయన్... నిన్ను చూసి అంతా నేర్చుకోవాలి

లేడీ సూపర్ స్టార్ మరోసారి అందరి మనసు దోచుకుంది. ఇంతకు ముందు ఎన్నో సార్లు సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించడం ద్వారా మనసు దోచుకున్న నయనతార అప్పుడప్పుడు తన అందమైన రూపంతో... అందమైన నవ్వుతో సోషల్ మీడియాలో కనిపించి మనసు దోచుకున్న ఇప్పుడు మాత్రం ఆమె తన సింప్లిసిటీ మరియు సాంప్రదాయాలకు ఇచ్చే గౌరవం తో మనసు దోచుకుంది.

ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె పెళ్లి తర్వాత మీడియా లో కాస్త తక్కువే కనిపించింది. కనిపించిన ప్రతి సారి కూడా మెడలో విఘ్నేష్ శివన్ కట్టిన మంగళ సూత్రం తో కనిపించింది. పెళ్లి అయిన కొత్తలో తిరుమల వెళ్ళినప్పుడు ఇతర దైవ దర్శనానికి వెళ్లిన సమయంలో  కాబట్టి ఆమె పసుపు తాడుతో కనిపించిందని అంతా భావించారు.

కేవలం ఆమె పెళ్లి అయిన కొత్త లో దైవ దర్శనం కు మాత్రమే కాకుండా షూటింగ్ లకు హాజరు అవుతున్న సమయంలో కూడా ఆమె తన మెడలో ఉన్న పసుపు తాడును తీయకుండా హాజరు అవుతుంది. ధరించిన కాస్ట్యూమ్ ఏదైనా కూడా మెడలో మాత్రం విఘ్నేష్ శివన్ చేతితో కట్టించుకున్న మంగళ సూత్రం మాత్రం అలాగే ఉంటుంది.

తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో నయన్ కనిపించింది. స్టైలిష్ జీన్స్ మరియు టీ షర్ట్ మరియు జాకెట్ ధరించింది. అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో కూడా తన మంగళ సూత్రం ను తొలగించక పోవడం ఆమె యొక్క నిబద్ధతకు నిదర్శం అన్నట్లుగా అభిమానులు మరియు సోషల్ మీడియా వర్గాల వారు అంటున్నారు.

విఘ్నేష్ శివన్ తన కంటే ఇమేజ్ లో అన్ని విషయాల్లో తక్కువ వాడే అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ కనీసం మెడలో నల్లపూసల దండ కాని మంగళ సూత్రం ధరించడం లేదు. హీరోయిన్స్ మాత్రమే కాకుండా చిన్న రేంజ్ సెలబ్రెటీలు కూడా ఖాళీ మెడతో కనిపిస్తున్నారు. కాని నయనతార మాత్రం పసుపు తాడుతో కనిపించి శభాష్ అనిపించుకుంటుంది.

ఆ హీరోయిన్స్ అంతా కూడా ఖచ్చితంగా నయన్ ను చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నో విషయాల్లో కూడా నయనతా ఇతర నటీమణులకు మరియు సెలబ్రెటీలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. స్టార్ హీరోయిన్ గా ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఖ్యాతి దక్కించుకున్న కూడా ఆమె చాలా సింప్లిసిటీ తో ఉంటారు. ఈ విషయం కూడా అందరికీ ఆదర్శం.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×