అభిమానం పేరుతో ప్రాణాలతో చెలగాటం

సౌత్ ఇండియన్ సినిమా హీరోలకు ముఖ్యంగా స్టార్ హీరోలకు లక్షల్లో.. కోట్లల్లో అభిమానులు ఉంటారు. తమిళం మరియు తెలుగు స్టార్ హీరోల అభిమానుల అరాచకాలు కొన్ని సార్లు బాబోయ్ అనిపించక మానవు. చాలా మంది హీరోల ఫ్యాన్స్ మొదటి షో.. మొదటి రోజు సినిమానే చూడనివ్వరు.

సాదారణ ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాలను మొదటి రోజు చూసేందుకు ఆసక్తి చూపనంతగా ఆయా హీరోల సందడి ఉంటుంది.

అభిమానుల అభిమానం అనేది శృతి మించకుంటే పర్వాలేదు.. కాని ఎప్పుడైతే అభిమానులు హద్దులు మీరుతున్నారో అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తమిళనాట హీరోల ఫ్యాన్స్ మద్య గొడవలు.. హత్యలు కామన్ అన్నట్లుగా పరిస్థితి మారింది. హీరోల కోసం ఎంతకైనా అన్నట్లుగా తిగించే ఫ్యాన్స్ తమిళనాడులో చాలా మంది ఉన్నారని తాజాగా మరోసారి నిరూపితం అయ్యింది.

తమిళనాడుకు చెందిన ఒక విజయ్ ఫ్యాన్ క్రేన్ సాయంతో తన బాడీకి తాడు కట్టుకుని దాదాపు వంద అడుగుల ఎత్తుకు వెళ్లి అక్కడ విజయ్ పోస్టర్ ను వదిలాడు. దాదాపుగా యాబై అడుగుల విజయ్ ప్లెక్సీ ని చూసి అభిమానులు వెర్రి అభిమానం తో కేకలు వేయడం వీడియోలో చూడవచ్చు. తమిళనాట అభిమానం కు ఇది పరాకాష్ట అనడంలో సందేహం లేదు.

ఈ అభిమానం కాస్త బెడిసి కొట్టి తాడు తెగడం మరేదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటీ... అభిమానం పేరుతో ప్రాణాలతో చెలగాటం ఎంత వరకు కరెక్ట్.. ఇలా అభిమానం చూపించడం ను హీరో విజయ్ కూడా హర్షించక పోవచ్చు. ఆయన కూడా సదరు అభిమాని ని మందలించే అవకాశం ఉంది. మందలించాల్సిన అవసరం కూడా ఉందని మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో హీరో సీరియస్ అవ్వకుంటే రేపు మరో అభిమాని తన అభిమానం ను చూపించుకునేందుకు మరో సాహసం చేయడం ఖాయం. అందుకే అభిమానం పేరుతో ఇలా చేసే వారిని కఠినంగా మందలించాల్సిన అవసరం ఉంది. వీరిపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలంటూ సాధారణ జనం కోరుకుంటున్నారు. అభిమానం పేరుతో మంచి చేయడం పర్వాలేదు కానీ ప్రాణాలతో చెలగాటం మంచిది కాదు.

 
 

இவர் தான் டா உண்மையான தளபதி ரசிகன்.....

× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×