చిక్కుల్లో స్పైస్ జెట్.. వివరణ కోరుతూ డీజీసీఏ నోటీసులు?

ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ వరుస సమస్యలతో అభాసుపాలవుతోంది. స్పైస్ జెట్ విమానాల్లో చోటు చేసుకుంటున్న వరుస సాంకేతిక సమస్యల నేపథ్యంలో డీజీసీఏ సీరియస్ అయ్యింది. స్పైస్ జెట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)  18 రోజుల్లో 8 లోపాల సంఘటనల నేపథ్యంలో ఇవాళ స్పైస్ జెట్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూలై 5న స్పైస్ జెట్ చైనాకు వెళ్లే విమానాల్లో ఒకదానిలో వాతావరణ రాడార్ సరిగా పనిచేయకపోవడంతో మరో సాంకేతిక సమస్యలతో దెబ్బతినడంతో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

జూలై 5న స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ 737 ఫైటర్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ కోల్ కతా నుంచి చాంగ్ కింగ్ కు వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ తర్వాత.. వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దాని తర్వాత పైలెట్ కోల్ కతాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.  కోల్ కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు.

ఇక ఇదే రోజు తెల్లవారుజామున స్పైస్ జెట్ విమానం పాకిస్తాన్ లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సూచిక లైట్ సరిగా పనిచేయకపోవడంతో అత్యవసరంగా దిగిపోవాల్సి వచ్చింది. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని స్పైస్ జెట్ తెలిపింది.

జూలై 2న జబుల్ పూర్ కు వెళుతున్న స్పైస్ జెట్ విమానం 5వేల అడుగుల ఎత్తులో క్యాబిన్ లో పొగలు రావడంతో సిబ్బంది తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. జూన్ 24 జూన్ 25న టేకాఫ్ అవుతున్నప్పుడు రెండు వేర్వేరు స్పైస్ జెట్ విమానాలపై ప్యూజ్ లేజ్ డోర్ హెచ్చరికలు వెలుగుతున్నాయి.తద్వారా వారు తమ ప్రయాణాలను విడిచిపెట్టి తిరిగి వెళ్లవలసి వచ్చింది. జూన్ 19న పాట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే 185మంది ప్రయాణికులతో ఢిల్లీకి వెళ్లే క్యారియార్ విమానంలోని ఇంజన్ మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీకొనడంతో ఇంజిన్ లో లోపం ఏర్పడింది.

జూన్ 19న కూడా ఇలానే క్యాబిన్ ప్రెషరైజేషన్ సమస్యల కారణంగా స్పైస్ జెట్ విమానం ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. గత మూడేళ్లుగా విమానయాన సంస్థ నష్టాలను చవిచూస్తోంది. గత మూడేళ్లుగా వరుసగా 2200 కోట్లకు పైగా నష్టాలను స్పైస్ జెట్ చవిచూసింది. అందుకే తాజాగా డీజీసీఏ నోటీసులు జారీ చేసింది.
× RELATED ఈటల కాంగ్రెస్ లోకి.. లెక్క ఇదేనా?
×