పొంగల్ రేసులో మెగా హీరోల క్లాష్ ?

ఈ సంక్రాంతి సప్పగా సాగడంతో అందరి హీరోల దృష్టి ఇప్పడు 2023 సంక్రాంతి రేస్ పై పడింది. చాలా వరకు హీరోలు వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా చేసుకుని సినిమాలని రెడీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలు తమ క్రేజీ సినిమాల రిలీజ్ డేట్ లని సంక్రాంతికి ఫిక్స్ చేసి వార్ కి రెడీ అయిపోతే ఈ రేస్ లో మెగా హీరోలు కూడా పోటీకి దిగబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి సంక్రాంతికి తన సినిమాతో సై అంటున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి కర్చీఫ్ వేసేశారు. ఆయన తరహాలోనే రామ్ చరణ్ పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరి హర వీరమల్లు'. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.

దయాకర్ రావు తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం నాటి కోహినూర్ వజ్రం నేపత్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. గత కొంత కాలంగా వరుసగా బ్రేక్ లు పడుతూ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరికి సంక్రాంతి బరిలో దించాలన్నది మేకర్స్ ఆలోచన.  

అందుకు కోసం మేకర్స్ తో పాటు దర్శకుడు క్రిష్ కూడా సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ విషయంలో ప్రత్యేక ప్లాన్ ని సెట్ చేసుకుని శరవేగంగా ఈ మూవీని పూర్తి చేసి సంక్రాంతికి సిద్ధం చేయాలనే ఆలోచనలో క్రిష్ వున్నారట. ఇక ఈ మూవీ తరహాలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కూడా సంక్రాంతికి రానుందని ప్రచారం జరుగుతోంది. RRR తరువాత చరణ్ పాపులర్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ దిల్ రాజు మాత్రం ఈ మూవీని సమ్మర్ కే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి బరిలో విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' పోటీపడనున్న నేపథ్యంలో చరణ్ మూవీని దిల్ రాజు సమ్మర్ కు మార్చేశారట. దీంతో మెగా హీరోల మధ్య క్లాష్ వుండదని తెలుస్తోంది.

కానీ  చిరు 'వాల్తేరు వీరయ్య'తో సంక్రాంతి బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతికి కలుద్దాం అంటూ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.  'గాడ్ ఫాదర్'దసరాకు రానుండగా 'వాల్తేరు వీరయ్య'ని సంక్రాంతికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో మెగా హీరోల మధ్య క్లాష్ వుండే అవకాశం వుందని తెలుస్తోంది. వీరికి తోడు ప్రభాస్ 'ఆది పురుష్' తో రాబోతున్నానని ముందే ప్రకటించేసిన విషయం తెలిసిందే.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×