ఈ సారైనా వైరమ్ ధనుష్ లెక్క మారేనా?

మన దగ్గర టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మందే వున్నారు కానీ వారి పొటెన్షియాలిటీని ఇంత వరకు సరిగ్గా వాడుకున్నావారు లేరు. చాలా తక్కువే అని చెప్పొచ్చు. అందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి ఒకరు. పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించి ఆకట్టుకోగల సత్తా వున్నా ఆది ఇంత వరకు ఆ వైపుగా ఆడుగులు వేయడం లేదన్నది చాలా మంది వాదన. ప్రస్తుతం ఉస్తాద్ రామ్ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్  'ది వారియర్'. తెలుగు తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగుస్వామి తెరకెక్కించారు.

కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ గా గురు పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 1 న విడుదల చేసిన ట్రైలర్ ట్రెమండస్ హిట్ గా నిలిచి సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ట్రైలర్ లో ఆది పినిశెట్టి కనిపించిన విధానం.. మనిషన్నోడూ ఒకటి బలంతో బతకాలా లేదంటే భయంతో బతకాలా??.. అంటూ రూత్ లెస్ విలన్ గా చూపించిన తీరు అంచనాల్ని పెంచేసింది. పక్కాగా చెప్పాలంటే ఆది పినిశెట్టి తన లుక్స్ స్క్రీన్ ప్రజెన్స్..పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడు.

ఇందులో పోషిస్తున్న గురు పాత్రతో టాలీవుడలో ఆది పినిశెట్టి బిజీగా మారడం ఖాయమని అంతా అంటున్నారు. గత కొంత కాలంగా తన స్పీడుతో పాటు క్రేజ్ తగ్గడంతో డల్ అయిపోయిన ఆది పినిశెట్టి 'ది వారియర్' మూవీతో రెండు భాషలలోనూ మళ్లీ ఫామ్ లోకి రావడం గ్యారెంటీ అంటున్నారు.

ఇదే మాటలు గతంలోనూ వినిపించాయి. ఆది తొలిసారి విలన్ గా మారిన మూవీ 'సరైనోడు'. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను అత్యంత పవర్ ఫుల్ పాత్రలో ఆది పినిశెట్టిని వైరమ్ ధనుష్ గా ప్రజెంట్ చేశారు.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ మూవీ ఆ తరువాత ఆది పినిశెట్టికి భారీ స్థాయిలో ఆఫర్లని అందిస్తుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. 'అజ్ఞాతవాసి' సినిమాలో తప్ప ఆది పినిశెట్టి మరో భారీ మూవీలో కనిపించలేదు. 'రంగస్థలం' మూవీలో కీలక పాత్రలో నటిస్తే ఇదే తరహాలో బాగుంటుంది భారీ ఆఫర్లు వస్తాయన్నారు.. అదీ జరగలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ 'ది వారియర్' మూవీతో విలన్ గా సందడి చేయడానికి రెడీ అవుతున్న వేళ ఆది లెక్క ఈసారైనా మారేనా? అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రంగా ఏక కాలంలో విడుదలవుతున్నఈ మూవీ ఆది కెరీర్ ని మలుపు తిప్పుతుందా? అని అంతా చర్చించుకుంటున్నారు. ఏం జరగనుందన్నది తెలియాలంటే జూలై 14 వరకు వేచి చూడాల్సిందే.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×