వైరల్: 91 ఏళ్ల మీడియా మొఘల్ కు నాలుగోసారి విడాకులు

ప్రపంచవ్యాప్తంగా విశాలమైన మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన మర్ధోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ డాలర్లు. ఇదివరకే ఈయనను ఫోర్బ్స్ పత్రిక గుర్తించి కీర్తించింది. న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ గా .. బిలియనీర్ గా.. మూవీ మొఘల్ గా ఈయన పేరుగాంచాడు. ప్రపంచ మీడియా మొఘల్ గా పిలురుకున్న రూపర్ట్ మర్ధోక్ ఆస్తుల విలువ 91 ఏళ్లు. తాజాగా 4వ సారి ఇతడు విడాకులు తీసుకుంటున్నారు. ఇది ఆయనకు 4వ విడాకులు కావడం గమనార్హం.

91 సంవత్సరాల వయస్సులో రూపర్ట్ మర్డోచ్ జెర్రీ హాల్తో విడాకులు తీసుకుంటున్నారు.  ఇది ఆయనకు నాల్గొవ విడాకులు కాగా.. మోడల్-నటికి ఇది మూడవ విడాకులు కావడం విశేషం..

 2016లో సెంట్రల్ లండన్లోని ఒక భవనంలో  మర్డోక్ మరియు 65 ఏళ్ల హాల్ వివాహం చేసుకున్నారు.  తనకంటే 25 ఏళ్లు చిన్నదైన హాల్.. ప్రముఖ అమెరికన్ నటి మోడల్. అయితే వీరి విడాకుల వార్తలపై స్పందించడానికి ఇరువురు ప్రతినిధులు నిరాకరించారు. వారి సన్నిహితులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ముర్డోక్ గతంలో ఆస్ట్రేలియన్ ఫ్లైట్ అటెండెంట్ ప్యాట్రిసియా బుకర్ను 1956లో వివాహం చేసుకున్నారు. ఆమెతో 1967 వరకు సంసారం చేసి విడాకులు ఇచ్చాడు.  స్కాటిష్ లో జన్మించిన జర్నలిస్ట్ అన్నా మన్ తో రెండో వివాహం చేసుకొని  1967 నుండి 1999 వరకు జీవించాడు.  చైనీస్ కు చెందిన వెండి డెంగ్ ను వివాహమాడి 1999 నుండి 2014 వరకు కొనసాగాడు.

ఇక హాల్ గతంలో రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్మ్యాన్ మిక్ జాగర్ను వివాహం చేసుకుంది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారి వివాహాలలో ముర్డోక్ మరియు హాల్లకు 10 మంది పిల్లలు ఉన్నారు.

ముర్డోక్ యొక్క న్యూస్ కార్పొరేషన్ సామ్రాజ్యం అమెరికాలోని ఫాక్స్ న్యూస్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్.. యూకే లోని ది సన్ మరియు ది టైమ్స్తో సహా ప్రధాన మీడియా సంస్థలను నియంత్రిస్తుంది.మీడియాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మర్ధోక్ ఈ 91 ఏళ్ల వయసులో నాలుగోసారి విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
× RELATED కరెన్సీ నోట్లపై ఆర్బీఐ సంచలన ఆదేశాలు
×