హీరోయిన్ శాపంతోనే ఆయన సీఎం పదవికి ముప్పు!

దేశం మొత్తం ప్రస్తుతం మహారాష్ట్ర వైపు చూస్తోంది. అక్కడ రాజకీయ అనిశ్చితికి కారణం బీజేపీ అంటూ కొందరు వాదిస్తూ ఉంటే.. మరి కొందరు శివసేన పార్టీ హిందుత్వం ను వీడటం అంటూ మరి కొందరు వాదిస్తున్నారు. ఈ సమయంలో కొందరు మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పెట్టిన శాపం.. ఆమె కన్నీళ్లు ఉద్ధవ్ ఠాక్రే యొక్క ముఖ్యమంత్రి పీఠం ను కదిలించాయి అంటున్నారు.

ఉద్దవ్ ఠాక్రే సీఎంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే కు మద్దతు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. బీజేపీ అతి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని తేలిపోయింది. సొంత పార్టీ నేతలను ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయారు అంటూ ఉద్దవ్ పై మహా వికాస్ అఘడి లోని ఇతర పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సమయంలో సోషల్ మీడియాలో కంగనా రనౌత్ పాత వీడియో లు వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం కంగనా రనౌత్ బీజేపీ కి మద్దతుగా శివసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి మరియు ఆయన తనయుడు పై కూడా చాలా సీరియస్ గా విమర్శలు చేసింది. ఆ సమయంలో శివసేన కార్యకర్తలు ఆమెను ముంబయి లో తిరగనివ్వం అంటూ హెచ్చరించారు.

కంగనా ఎంతో ఇష్టపడి కట్టుకుని మణికర్ణిక ఆఫీస్ ను ముంబయి మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కూల్చేశారు. కంగనా ఆ సమయంలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో లో నేడు నీ చేతిలో అధికారం ఉంది కనుక ఇలా చేశావు.

కాని ఆ అధికారం నీకు ఎప్పటికి ఉండదు అని గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించింది. మరో వీడియో లో ఆమె మాట్లాడుతూ ఒక మహిళను బాధ పెట్టిన ఏ ఒక్కరు సుఖ పడ్డట్లు.. సంతోషంగా ఉన్నట్లుగా లేదు.

త్వరలోనే మీ పతనం ఉంటుందని కంగనా ఆ సమయంలో శాపం పెట్టింది. ఆమె శాపం చాలా తక్కువ సమయంలోనే నిజం అయ్యింది అన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ సదరు వీడియోలను షేర్ చేస్తున్నారు. మహా ప్రభుత్వం సంక్షోభం విషయంలో కంగనా ఎలా స్పందిస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


× RELATED లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!
×