వైరల్ పిక్: ఒకే ఫ్రేమ్ లో మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్..!

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో హీరో మంచు విష్ణు మరియు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఇండస్ట్రీలో ఎవరూ మరిచిపోలేరు. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయితే వీరిద్దరూ చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. దీనికి యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం వేదికైంది.

యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్ సేన్ - ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా ఓ మూవీ తెరకెక్కుతోంది. నేడు హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ వేడుకకు మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్ కూడా అటెండ్ అయ్యారు.

ఈ సందర్భంగా విష్ణు - ప్రకాశ్ రాజ్ ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకాశ్ రాజ్ - మంచు విష్ణులు సీరియస్ గా ఎదో మాట్లాడుకోవడం చూసిన నెటిజన్లు.. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్ రాజ్ - మంచు విష్ణు బరిలో దిగారు. ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకూ ప్యానల్స్ మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.

నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దాకా వెళ్లారు. చివరికి ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి 'మా' అధ్యక్ష పీటాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రకాశ్ రాజ్ తో సహా ఆయన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు అసోసియేషన్కు రాజీనామా చేశారు.

అ‍ప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ - మంచు విష్ణు ఒకరికొకరు ఎదురు పడిని దాఖలాలు లేవు. విష్ణు 'మా' ప్రెసిడెంట్ అయిన కొన్ని రోజులు మాత్రం ట్వీట్స్ - ప్రెస్ మీట్స్ తో మాట్లాడుకున్నారు. ఇన్నాళ్ళకు ఇప్పుడు వీరిద్దరు ఒకే వేదికను పంచుకోవడం.. ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి వీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
× RELATED ఎన్టీఆర్ కోసం అనుకుంటే గోపీచంద్ రెడీ అవుతున్నాడే!
×