పాపం .. మారుతి కొత్తగానే ట్రై చేశాడు కానీ .. !

ఈ రోజుల్లో మార్కెట్లో కి ఏ వస్తువును పంపిస్తున్నా .. మార్కెట్లో ఉన్న వస్తువుల పట్ల జనాలకి ఆకర్షణ కలగాలన్నా అందుకు ఒక రేంజ్ లో పబ్లిసిటీ అవసరమవుతోంది.  వర్మ చెప్పినట్టుగా ఏ వస్తువునైనా ముందుగా చూసి కొంటారు.

ఆ వస్తువు అంత చేస్తుందా లేదా? అనేది అక్కడే తెలిసిపోతుంది. కానీ సినిమా అనేది అలా కాదు .. టిక్కెట్టు కొన్న తరువాతనే అది ఎలా ఉందనేది ప్రేక్షకుడికి తెలుస్తుంది. అప్పుడతను ఏమీ చేయలేడు. అందువల్లనే టిక్కెట్టు కొనడానికే ప్రేక్షకులు ఆలోచన చేస్తారు. వాళ్లతో టిక్కెట్టు కొనిపించడమనేది మేకర్స్ కి ఒక సవాల్ వంటింది.

అందువల్లనే సగటు ప్రేక్ష కుడితో  టిక్కెట్ కొనిపించడానికి మేకర్స్ ఎన్నో ప్రణాళికలు రెడీ చేస్తుంటారు. తమ సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉండాలనే ఆలోచన చేస్తారు. జనమంతా తమ సినిమాను గురించి మాట్లాడుకోవాలి .. అంతా కూడా తమ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని వెయిట్ చేయాలి. అందుకోసం తామేం చేయాలనే విషయంపై ఒక టీమ్ గా ఏర్పడి కసరత్తు చేస్తుంటారు. పాత ఫార్మేట్ జనాలకి బోర్ కొట్టేస్తుంది గనుక  .. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో సతమతమై పోతుంటారు.

'పక్కా కమర్షియల్' విషయంలోను మారుతి - బన్నీవాసు తమ టీమ్ తో కలిసి ఇలాంటి చర్చలతోనే బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా ఉండాలనీ .. ఈ సినిమాను మరింత పైకి లేపమని తనని బన్నీ వాసు సతాయించేస్తున్నాడనీ, ఏదైనా ఐడియా ఉంటే చెప్పమని తన టీమ్ సభ్యులతో మారుతి అంటాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా సీరియల్ ఆర్టిస్ట్ కనుక, ఆ వైపు నుంచి కొత్తగా ప్రమోషన్ ప్లాన్ చేద్దామనే ఐడియా మారుతికి నచ్చుతుంది. అదే విషయాన్ని బన్నీవాసుతో చెప్పాలని మారుతి అనుకుంటాడు.

అంతలో బన్నీవాసు అక్కడికి వస్తాడు. ఆయన ఎవరు చెప్పినవి వినిపించుకోడు. ఈ నెల  26వ తేదీన గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేద్దామని అంటాడు. అందులో కొత్తదనం ఏవుందని టీమ్ సభ్యులు అంటారు. ఇలాంటి ఒక ఈవెంట్ ను మనమే ఫస్టుటైమ్ చేస్తున్నట్టుగా చెప్పడమేనని బన్నీ వాసు తేల్చిపారేస్తాడు. ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా ఒక రేంజ్ స్టార్ వస్తారని చెబుతాడు.

సినిమాల్లోని కౌంటర్ ఎక్స్ ప్రెషన్స్ ను .. డైలాగ్స్ ను తీసుకుని ఈ వీడియోను వదిలారు. ఏదో చేయాలనుకుంటే ఏదో అయిందనిపించక మానదు. కొత్తగా ఏదైనా చేయాలనే ఒక ఆలోచనను ఇంత పాత పద్ధతిలో ఆవిష్కరించడం చూసిన తరువాత ఎవరికైనా సరే బుర్ర తిరిగిపోకుండా ఆగదు.


 
× RELATED లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!
×