పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎవరికి వీరాభిమానో తెలుసా?

తెలుగు ప్రేక్షకుల్లో యాక్షన్ కింగ్ అర్జున్ కున్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. 'మన్నెంలో మొనగాడు' మూవీతో తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన అదే అభిమానంతో తెలుగులో తన కుమార్తె ఐశ్వర్యని హీరోయిన్ గా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు.  కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయనే దర్శకుడిగా శ్రీరామ్ ఇండర్నేషనల్ బ్యానర్ పై గురువారం ఓ మూవీని ప్రారంభించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

హీరో అర్జున్ కు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు అయిన జగపతిబాబు ఈ మూవీలోని కీలక పాత్రలో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా యాక్షన్ కింగ్ అర్జున్ తెరక్కించనున్న ఈ మూవీని గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

పూజా కార్యక్రమాల అనంతరం విశ్వక్ సేన్ ఐశ్వర్య అర్జున్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ నిచ్చారు. భారీ స్థాయిలో రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ లాంచింగ్ కి పవర్ స్టార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం.. విశ్వక్ సేన్ ఐశ్వర్య అర్జున్ లపై క్లాప్ నివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇంత వరకు యాక్షన్ కింగ్ అర్జున్ - పవన్ ల మధ్య ఎలాంటి సంభాషణ కాని ఒకరి గురించి ఒకరు కానీ చెప్పిన సందర్భాలు లేవు. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కూతరు టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న మూవీ లాంఛింగ్ లో పవన్ ప్రత్యక్ష్యం కావడం విశేషం.

అంతే కాకుండా ఈ మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవర్ స్టార్ హీరో అర్జున్ కు తాను వీరాభిమాని నని చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ మూవీకి పవన్ క్లాప్ నివ్వగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కెమెరా స్విఛాన్ చేశారు. హీరో మంచు విష్ణు స్క్రిప్ట్ ని హీరో అర్జున్ కి అందజేశారు. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ రూపొందుతున్న ఈ మూవీకి మాటలు సాయి మాధవ్ బుర్ర సంగీతం 'కేజీఎఫ్' ఫేమ్ రవి బాస్రూర్ పాటలు చంద్రబోస్ కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ కోన సినిమాటోగ్రఫీ బాలమురుగన్.
× RELATED లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!
×