SSMB30 కి క్రేజీ కాంబో సెట్టయిందా?

కొన్ని కాంబినేషన్ లకు ప్రేక్షకులు అభిమానులు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి కాంబినేషన్ లని సెట్ చేసుకుంటూ ఆసక్తిని రేకెత్తున్నారు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. కరోనా కారణంగా సినిమాల నిర్మాణం ఆలస్యం కావడంతో మహేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండేళ్లు పట్టింది. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల బారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని ఆకట్టుకోలేపోయింది.

ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు త్రివిక్రమ్ మూవీ అయినాఈ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. 'సర్కారు వారి పాట' తరువాత సూపర్ స్టార్ మహేష్ తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల సుధీర్ఘ విరామం తరువాత మహేష్ - త్రివిక్రమ్ ల కలయికలో రానున్న ఈమూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు.

బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై సెకండ్ వీక్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫైనల్ స్క్రిప్ట్ కి జర్మనీలో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాటు మొదలు పెట్టేశారు. ఈ మూవీ తరువాత మహేష్ తన 29వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ లైన్ లాక్ అయిందని ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు కూడా.

ఇదిలా వుంటే మహేష్ తన 30 వ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నారంటూ తాజాగా వార్తలు వినిసిస్తున్నాయి. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్నారన్నది తాజా న్యూస్. గతంలో 'వన్ నే నొక్కడినే' వంటి మూవీ వీరిద్దరి కలయికలో రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఈ మూవీ తరువాత 'పుష్ప' చేయాలని ప్లాన్ చేసినా మహేష్ ఆసక్తిని చూపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త అల్లు అర్జున్ చేతికి వెళ్లడం.. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడం తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత మళ్లీ మహేష్ - సుకుమార్ కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారట. దీని కోసం సుకుమార్ ఓ క్రేజీ లైన్ ని కూడా సిద్ధం చేశారని మహేష్ కూడా సుక్కుతో ప్రాజెక్ట్ చేయడానికి సుముఖంగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ రాజమౌళి సినిమా తరువాత పట్టాలెక్కే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×