మహేష్ సినిమా మళ్ళీ వచ్చేసింది.. ఫ్యాన్స్ పండుగ షురూ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్త సురేష్ హీరోయిన్ గా రూపొందిన సర్కారు వారి పాట  ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కు మొదట కొందరు నెగటివ్ టాక్ ను ప్రచారం చేసినా కూడా ఓవరాల్ మాత్రం సినిమా మంచి కమర్షియల్ హిట్ ను అందుకుంది అంటూ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా బల్లగుద్ది మరీ ప్రకటించారు.

ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా సక్సెస్ సినిమాల జాబితాలో పడ్డట్లే అంటూ మహేష్ బాబు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంకా సినిమాను చూడని వారు ఓటీటీ లో స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పే పర్ వ్యూ పద్దతిన ఉన్నా కూడా అమెజాన్ ఖాతాదారులు సినిమా రెగ్యులర్ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేశారు.

కొన్ని రోజుల క్రితం ప్రకటించినట్లుగానే నేటి నుండి స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. అర్థ రాత్రి నుంచి మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా ను తెగ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సినిమా ను థియేటర్ లో చూసిన వారు కూడా మళ్లీ మళ్లీ లూప్ లో సర్కారు వారి పాట సినిమా ను టీవీలో చూస్తున్నట్లుగా సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా లో మహేష్ బాబు పాత్ర మరియు కీర్తి సురేష్ స్కిన్ షో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక థమన్ అందించిన మమ మహేష్.. కళావతి పాటలతో పాటు ఇటీవల సినిమా లో యాడ్ అయిన మురారివా పాట కూడా సినిమా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తో ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా ను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. జూలై నుండి మహేష్..

త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరో వైపు జక్కన్న కూడా మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు.
× RELATED లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!
×