గ్లాస్ లో కాక్ టైల్ ఏమైంది అనన్యా?

బాలీవుడ్ అనే రంగుల ప్రపంచంలో నవయవ్వన శిరుల నిరంతర ప్రవాహం గురించి చెప్పాల్సి పనే లేదు. జాన్వీ కపూర్ .. అనన్య పాండే నటవారసులుగా రంగ ప్రవేశం చేసి పెద్ద సక్సెస్ అందుకున్నారు. స్టార్లుగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లతో పాటు కపూర్ కిడ్ షానయ కపూర్ కూడా నాయికగా రాణించేందుకు బిగ్ ప్లాన్ తో ఉంది. ఆ ముగ్గురూ ఎంతో క్లోజ్  ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. క్లబ్బు పబ్బు రెస్టారెంట్ .. పార్టీ ఏదైనా ఆ ముగ్గురూ కలిసే వెళుతుంటారు. ఇక పార్టీలో చిలౌట్ కూడా అదే రేంజులో ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సదరు భామలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటారు.

జాన్వీ కపూర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాన్వీ- షానయ కపూర్- అనన్య పాండే సహా స్నేహితుల సమూహం కాక్ టైల్ పార్టీలో ఫుల్ గా చిలౌట్ చేసారు.

అయితే ఈ నైట్ పార్టీకి సందర్భం ఏమిటీ అంటే?  జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఊటీ నుండి తిరిగి రావడంతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారని సమాచారం. ఖుషీ నటిస్తున్న తొలి చిత్రం 'ది ఆర్చీస్' మొదటి షెడ్యూల్ ముగియడంతో ఇలా పార్టీకి ఏర్పాట్లు చేసారట. అందాల భామలంతా గ్లామరస్ డ్రెస్సుల్లో దుమ్ము దులిపారు.  ఇన్ స్టాలో ప్రస్తుతం ఈ పార్టీ ఫోటోగ్రాఫ్స్ వైరల్ గా మారాయి.

కెమెరా ముందు భామలు రకరకాలుగా హొయలు పోయిన ఫోటోలతో పాటు డ్యాన్సుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ ఫోటోలో జాన్వి- షానయ- అనన్య లు స్నేహితుడు ఓర్హాన్ తో కలిసి పోజులు ఇచ్చారు. షానయ సిల్వర్ స్ట్రాప్ లెస్ మినీ డ్రెస్ ధరించగా.. అనన్య లేత గోధుమరంగు కటౌట్ డ్రెస్ లో కనిపించింది. అనన్య తన చేతిలో కాక్ టైల్ గ్లాస్ అందులో స్నాక్స్ ను పట్టుకుని ఉంది.

అయితే ఈ ప్లేట్ ని పరిశీలనగా చూస్తే అందులో ఆలూ భుజియా కనిపించింది. నిజానికి అది ఒరిజినల్ ఫోటోనా లేక మార్ఫింగ్ చేసినదా? అన్నది కూడా అర్థం కాలేదు. అయితే ఇది అభిమానులు సరదా కోసం చేసిన పని అని ఆ తర్వాత ఆలోచిస్తే తాపీగా అర్థమవుతోంది. నిజానికి కాక్ టైల్ స్థానంలో ఆలూ భుజియాని ఫోటోషాప్ లో చేర్చారని అర్థమవుతోంది.

ప్రస్తుతం కెరీర్ పరంగా జాన్వీ- అనన్య భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనన్య నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ విడుదలకు రావాల్సి ఉంది. షానయా భేధడక్ అనే చిత్రంతో కథానాయికగా పరిచయమవుతోంది. ధరమ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార 'ధడక్' తో జాన్వీని పరిచయం చేసినట్టే భేధడక్ తో షానయను పరిచయం చేస్తున్నారు. ఖుషీ కపూర్ మాతరం ఆర్చీస్ అనే వెబ్ సిరీస్ తో తెరకు పరిచయమవుతోంది. గల్లీ బోయ్స్ ఫేం జోయా అక్తర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.
× RELATED ఎన్టీఆర్ కోసం అనుకుంటే గోపీచంద్ రెడీ అవుతున్నాడే!
×