బాలీవుడ్ బాద్ షా తో టాలీవుడ్ హంక్ సమరానికి సై అన్నాడా?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినిమా చేసి దాదాపు మూడేళ్లు దాటుతోంది. 2018లో ఆనంద్ ఎల్. రాయ్ రూపొందించిన 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై షారుక్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా షారుక్ షాక్ కు గురయ్యాడు. ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న విషయంలో కన్ఫ్యూజన్ మొదలవ్వడంతో ఏ ప్రాజెక్ట్ నీ పట్టాలెక్కించలేకపోయారు.

మరుగుజ్జు పాత్రలో ప్రయోగాత్మకంగా చేసిన 'జీరో' దారుణంగా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో మూడేళ్లుగా ఏ ప్రాజెక్ట్ ని అంగీకరించలేదు. మూడేళ్ల విరామం తరువాత ఎట్టకేలకు షారుక్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై రూపొందుతున్న 'పఠాన్'తో పాటు 'డుంకి' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీలతో పాటు తమిళ దర్శకుడు అట్లీ కుమార్ డైరెక్షన్ లోనూ ఓ భారీ మూవీకి షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.

'జవాన్' పేరుతో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో షారుక్ అట్లీల స్టైల్లో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ ని విడుదల చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశారు. ఒళ్లంతా గాయాలతో ముఖం కనిపించి కనిపించకుండా కవర్ చేసుకుని చేతిలో కత్తి పట్టుకుని ఫ్లాట్ ఫాం పై కూర్చుని కనిపించిన షారక్ లుక్ అంచనాలని పెంచేసి షారుక్ ఈ సార్ సమ్ థింగ్ స్పెషల్ మూవీతో రాబోతున్నాడనే సంకేతాల్ని అందించింది.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ ఈ ప్రాజెక్ట్ పై మరింత బజ్ ని క్రియేట్ చేస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న 'జావాన్'లో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ నెట్టింట వైరల్ గా మార్చింది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

రానా కీ రోల్ లో నటించనుంది నిజమైతే ఈ ప్రాజెక్ట్ లో రానా.. షారుక్ లో సమరానికి సై అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడా?  లేక పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడా? అన్నది మాత్రం తెలియాల్సి వుంది. రానా రీసెంట్ గా 'విరాటపర్వం' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కలెక్షన్ లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
× RELATED లండన్ వీధుల్లో యంగ్ హీరో... హీరోయిన్ సయ్యాట!
×