అంతరిక్షంలో రేపు అద్భుతం.. ఒకే వరుసలో 5 గ్రహాలు

ఈ సృష్టి ఎలా ఏర్పడింది? దీనికి అంతం ఉందా? లేదా? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు తెలియవు. అదొక బ్రహ్మరహస్యంగా మిగిలిపోయింది. ఖగోళ వింతలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా అంతరిక్షంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.

సూర్యుడు చుట్టు తిరిగే 5 గ్రహాలు ఒకే సరళరేఖలో కనిపించనున్నాయని ఖగోళ శాస్త్ర పరిశోధకులు చెబుతున్నాడు. బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి.

ఈ 5 గ్రహాలు 2004 డిసెంబర్ లో ఇలా ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేశాయి. మళ్లీ 18 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు. ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు.

గంట సమయం పాటు ఈ 5 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. దీన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు టెలిస్కోప్ బైనాక్యులర్ అవసరం లేకుండానే నేరుగా చూడొచ్చు.

సూర్యుడికి అత్యంత సమీపంలో బుధుడు ఉండడం వల్ల మామూలు సమయాల్లో చూడడం చాలా కష్టం. కానీ జూన్ 24న సూర్యుడి నుంచి బుధుడు దూరంగా జరగడం వల్ల స్పష్టంగా చూసేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం.. రేపు ఉదయం ఈ పంచ గ్రహాలను సూర్యోదయానికి ముందే చూసి ఎంజాయ్ చేయండి.
× RELATED కరెన్సీ నోట్లపై ఆర్బీఐ సంచలన ఆదేశాలు
×