టబు ఒంటరితనానికి ఆ స్టార్ హీరో కారణం?

ఆమె గొప్ప ప్రతిభావని. జాతీయ ఉత్తమ నటి. తనదైన అందం నటనతో దశాబ్ధాల పాటు పరిశ్రమల్ని ఏల్తూ యువతరంలో గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీమణి. కానీ వయసు ఐదు పదులు దాటుతున్నా ఇంకా పెళ్లి అన్నదే లేకుండా ఒంటరిగా ఉండిపోయింది. ఈ విషయంపై తనకు ప్రతిసారీ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. దానికి ఏదో ఒక  సమాధానం చెప్పి దాటవేస్తూనే ఉంటుంది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించో చెప్పాల్సిన పనే లేదు. ది గ్రేట్ టబు. దేశంలోని అందమైన నటీమణులలో టబు ఒకరు. ఆమె ఒంటరిగా ఉంది. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదని తరచుగా అడుగుతూనే ఉంటారు.

ఎట్టకేలకు తాను ఒంటరిగా ఉండడం వెనక అసలు కారణాన్ని టబు వెల్లడించింది. తాను ఒంటరిగా ఉండటానికి అజయ్ దేవగన్ కారణమని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. చిట్ చాట్ లో టబు సరదాగా మాట్లాడుతూ "నేను ఎదుగుతున్న సమయంలో అజయ్ దేవగన్ నా స్నేహితుల్లో ఒకడు. అతను నా కజిన్ సమీర్ ఆర్యకు పొరుగువాడు. నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు సమీర్- అజయ్ నాపై గూఢచర్యం చేసేవారు. నన్ను వెంబడించేవారు. నాతో మాట్లాడుతూ పట్టుబడిన అబ్బాయిలను కొడతామని బెదిరించేవారు" అని తెలిపారు.

ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ.. "ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. నేను ఈ రోజు ఒంటరిగా ఉన్నానంటే దానికి కారణం అజయ్. అతను పశ్చాత్తాపం చెందాడని.. చేసిన దానికి చింతిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఒంటరితనం శాపం కాదు. కానీ టబు లాంటి గొప్ప ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఒంటరిగా ఉండడం అభిమానులకు నచ్చదు. తనని ఫ్యామిలీ లైఫ్ లో చూడాలని ఆశపడే వాళ్లే ఎక్కువ. అయితే అది ఆమె వ్యక్తిగతం.

లైఫ్ ఈజ్ గోయింగ్..

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో టబుకి ఉన్న ప్రేమాప్యాయతలు గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనవి. నాగార్జున- చిరంజీవి- వెంకటేష్- బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల టబు తెలుగు ప్రేక్షకులకు టచ్ లోనే ఉన్నారు. సహాయనటిగా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు.

చిన్న సినిమా..పెద్ద సినిమా అనే బేధం లేకుండా మంచి పాత్ర అయితే నటిస్తున్నారు.  దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో  'అలవైకుంఠపురములో' చిత్రంతో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలుగులోనే కాకుండా ఇతర భాషలైన మలయాళ సినిమాలపైనా దృష్టి పెట్టి పని చేస్తున్నారు. ఓ నటి సెకెండ్ ఇన్నింగ్స్ లో మూడు భాషలపై ఫోకస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ టబు వాటిని ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుని మందుకు సాగుతున్నారు. ఏజ్ తో పని లేకుండా నటనపై తనకున్న ఫ్యాషన్ ని చాటి చెబుతున్నారు.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×