మూవీ రివ్యూ : విక్రమ్
నటీనటులు: కమల్ హాసన్-విజయ్ సేతుపతి-ఫాహద్ ఫాజిల్- సూర్య (క్యామియో)-నరేన్- కాళిదాస్ జయరాం-చెంబన్ వినోద్ జోస్-స్వస్తిక తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
నిర్మాతలు: కమల్ హాసన్-మహేంద్రన్
రచన-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకడు కమల్ హాసన్. ఆయన సినీ వైభవం గురించి చెప్పడానికి చాలా ఉంది. కానీ గత దశాబ్ద కాలంలో సినిమాలు బాగా తగ్గించేయగా.. చేసిన సినిమాల్లో కూడా ఆకట్టుకున్నవి తక్కువ. ఐతే ఇప్పుడాయన ప్రస్తుతం తమిళంలో ఉత్తమ దర్శకుల్లో ఒకడైన లోకేష్ కనకరాజ్ తో జట్టు కట్టడం.. ఇందులో విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి నటులు కూడా వీరికి తోడవడంతో ‘విక్రమ్’ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో అంచనాలను ఇంకా పెంచింది. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విక్రమ్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభంజన్ (కాళిదాస్ జయరాం).. చెన్నై కేంద్రంగా నడిచే డ్రగ్ సిండికేట్ కు చెందిన రెండు టన్నుల కొకైన్ ముడి పదార్థాన్ని పట్టుకుని.. దాచేస్తాడు. అది 2 లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగపడే సరుకు. దీని కోసం ఆ డ్రగ్ సిండికేట్ ను నడిపే సంతానం (విజయ్ సేతుపతి) ఓవైపు.. పోలీసులు మరోవైపు వెతుకుతుంటారు. ఈలోపు ప్రభంజన్ ను ఓ ముసుగు ముఠా చంపేస్తుంది. ఇంకో వారానికే అతడి తండ్రి అయిన కర్ణన్ (కమల్ హాసన్)ను కూడా ఆ ముఠా మట్టుబెడుతుంది. పోలీసులు ఈ ముసుగు ముఠాను పట్టుకోవడానికి సీక్రెట్ ఏజెంట్ అయిన అమర్ (ఫాహద్ ఫాజిల్)ను నియమించుకుంటారు. అతను తన టీంతో కలిసి ఓవైపు ప్రభంజన్.. కర్ణన్ హత్యల వెనుక ఉన్నా ముఠా గుట్టు రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కర్ణన్ గురించి అతడికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.. ఆ విషయాలేంటి.. అసలు కర్ణన్ ఎవరు.. అతడి నేపథ్యమేంటి.. ముసుగు ముఠాను నడిపిస్తున్నదెవరు.. వాళ్లెందుకు హత్యలు చేస్తున్నారు.. అమర్ తన విచారణలో సంతానం గురించి ఏం తెలుసుకున్నాడు.. చివరికి ప్రభంజన్ పట్టుకున్న డ్రగ్స్ ఏమయ్యాయి.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
కమల్ హాసన్ నట కౌశలం గురించి.. ఆయన పోషించిన పాత్రల గురించి.. చేసిన ప్రయోగాల గురించి.. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అలాంటి వైవిధ్యమైన నటుడు.. తనలాంటి ఫిల్మోగ్రఫీ ఉన్న ఆర్టిస్ట్ ఇంకొకరు కనిపించరు. ఐతే కెరీర్లో ఒక దశ దాటాక ఆయన ఆలోచన స్థాయిని అందుకునే దర్శకులు తగ్గిపోవడం.. అదే సమయంలో ఆయన ప్రేక్షకుల అభిరుచికి దూరం కావడం ప్రతికూలంగా మారి కమల్ ఈ తరం ప్రేక్షకులకు దూరం అయిపోయారు. అలాగే తన అభిమానులను కూడా మెప్పించలేకపోయారు. ఐతే ‘ఖైదీ’ లాంటి ఎగ్జైటింగ్ మూవీ తీసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ సినిమా అనగానే ఎంతో ఎగ్జైట్మెంట్ కలిగినప్పటికీ.. ‘ఖైదీ’తో లోకేష్ ఎంతగానో మెప్పింకాక విజయ్ లాంటి స్టార్ తో సినిమా అనేసరికి కమర్షియల్ లెక్కల్లో పడి ‘మాస్టర్’ను కలగాపులగం చేసేసిన అతను.. కమల్ తో మాత్రం మళ్లీ తన మార్కు సినిమా తీస్తాడా.. లేక మళ్లీ కమర్షియల్ ఉచ్చులో పడిపోతాడా అన్న సందేహాలు కలిగాయి. కానీ లోకేష్ ఈసారి దారి తప్పలేదు. తన శైలిలో యాక్షన్.. ఎమోషన్ కలగలిసిన ఆసక్తికర కథను తీర్చిదిద్దుకుని కమల్ స్థాయికి తగ్గ పాత్రను తీర్చిదిద్ది.. అభిమానులను అలరించే రీతిలో ఆయన్ని ప్రెజెంట్ చేసి.. విజయ్ సేతుపతి-ఫాహద్ ఫాజిల్ లను కూడా సరిగ్గా వాడుకుని ‘విక్రమ్’ను జనరంజకంగా మలిచాడు.
తమిళ సినిమాలందు లోకేష్ కనకరాజ్ సినిమాలు వేరు. ఒక సినిమాతో ఇంకో సినిమాకు కనెక్షన్ ఉండే అతడి ప్రపంచంలో డ్రగ్స్ ఉంటాయి. గన్నులుంటాయి. బిరియాని ఉంటుంది. కార్లు వ్యాన్లు బైకులు ఉంటాయి. గ్యాంగ్ స్టర్స్ ఉంటారు. పోలీసులుంటారు. ప్రధాన పాత్రధారికి పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ముఖ్య పాత్రధారులంటా ఒకరినొకరు కాల్చుకుంటూ.. ఒకరినొకరు ఛేజ్ చేసుకుంటూ తిరుగుతుంటారు. అతడి సినిమాలన్నీ చాలా వరకు రాత్రిపూటే నడుస్తాయి. ఇలా ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో నడుస్తాయి లోకేష్ సినిమాలు. ‘విక్రమ్’ కూడా అందుకు మినహాయింపు కాదు. విజయ్ లాగా కమల్ ఇమేజ్ గురించి.. అభిమానుల గురించి.. ఎలివేషన్లు-కమర్షియల్ హంగుల గురించి ఆలోచించే నటుడు కాదు కాబట్టి.. లోకేష్ ఎక్కడా రాజీ పడాల్సిన.. తన రూటు మార్చుకోవాల్సిన అవసరం పడేలేదు. ‘మాస్టర్’లో మాదిరి అవసరం లేని హీరో ఎలివేషన్లు.. బిల్డప్పులన్నీ పక్కన పెట్టి ‘ఖైదీ’ తరహాలో కథే ప్రధానంగా సాగిపోయాడు. కమల్ పాత్రను ఆసక్తికరంగా.. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా తీర్చిదిద్దడంతోనే అతను సగం మార్కులు కొట్టేశాడు. తొలి సన్నివేశంలోనే హీరోను చంపేస్తున్నట్లు చూపించడమే కాక.. అసలా పాత్ర తీరే అంతుబట్టని విధంగా సన్నివేశాలు నడవడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. అలాగే చాలా లేయర్స్ ఉండేలా కథను తీర్చిదిద్దుకోవడం.. దాన్ని స్ట్రెయిట్ గా నరేట్ చేయకుండా వైవిధ్యమైన స్క్రీన్ ప్లేను అనుసరించడం వల్ల కూడా ‘విక్రమ్’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మెప్పిస్తుంది.
గంటన్నర నిడివి ఉన్న ప్రథమార్ధంలో కమల్ కనిపించేది చాలా తక్కువ సన్నివేశాల్లో. పైగా వర్తమానంలో ఆయన పాత్రే అసలు కనిపించదు. ఫ్లాష్ బ్యాక్ లో అలా అలా వచ్చి పోతుంటుంది. కానీ కమల్ కనిపించడన్న మాటే కానీ.. ఆయన పాత్ర తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఇతర పాత్రల మాటలతో.. సన్నివేశాలతో ద్వారా కమల్ పాత్రకు రావాల్సిన ఎలివేషన్ అంతా వస్తూనే ఉంటుంది. ఇక విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజిల్ పాత్రల నేపథ్యాలు.. అలాగే వారి మార్కు స్క్రీన్ ప్రెజెన్స్-నటన ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా సేతుపతి ప్రతి సన్నివేశంలోనూ మెప్పిస్తాడు. ఆరంభంలో కమల్ పాత్ర గురించి మిస్ లీడ్ చేసేలా ఉన్న సన్నివేశాలకు ట్విస్ట్ ఇస్తూ.. కథను కొత్త మలుపు తిప్పుతూ.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో కమల్ ను తెరపైకి తీసుకొచ్చే ఎపిసోడ్ ప్రథమార్థానికి మేజర్ హైలైట్. గంటన్నరకు పైగా నిడివితో సాగే ప్రథమార్ధంలో ఎక్కడా బోర్ అన్న ఫీలింగ్ కలగదు. ఇక ప్రథమార్ధం తర్వాత భారీగా పెరిగే అంచనాలకు తగ్గట్లుగా ద్వితీయార్ధం లేకపోవడం ‘విక్రమ్’లో ప్రతికూలత. ద్వితీయార్ధంలో కమల్ పాత్ర గుట్టు విప్పుతూ.. అతడి గతాన్ని బయటపెడుతూ.. తన లక్ష్యం ఏంటో వెల్లడిస్తూ కథను ముందుకు నడిపించాడు లోకేష్.
ఐతే ఈ వయసులో కమల్ ను యువకుడిగా చూపించి సన్నివేశాలు తీయడం కష్టం కాబట్టి కథలో కూడా పోలికలు ఉండటంతో ఆయన పాత సినిమా ‘విక్రమ్’ విజువల్స్ వేసి ఫ్లాష్ బ్యాక్ లాగించేశాడు. హీరో పాత్రకు జరిగిన అన్యాయాన్ని సన్నివేశాల రూపంలో చూస్తేనే ప్రేక్షకుల్లో రావాల్సిన ఎమోషన్ వస్తుంది. కానీ ఇక్కడ దాని గురించి కేవలం మాటలతో సరిపెట్టేయడంతో ఎమోషన్ క్యారీ కాలేదు. హీరోకు అతడి కొడుక్కి మధ్య బంధాన్ని సన్నివేశాలతో ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నా లోకేష్ ఆ ప్రయత్నం చేయలేదు. హీరో అతడి మనవడికి మధ్య మాత్రం కొన్ని సన్నివేశాలతో ఎమోషన్ రాబట్టగలిగారు. ఇది కూడా మిస్ అయితే ‘విక్రమ్’ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారయ్యేది. ఎమోషనల్ సంగతి పక్కన పెట్టేసి యాక్షన్ విషయానికొస్తే మాత్రం సెకండాఫ్ లో మోత మోగిపోయింది. గంటా 20 నిమిషాల ద్వితీయార్దంలో దాదాపు గంట పాటు యాక్షనే కనిపిస్తుంది. ఛేజింగులు.. ఫైరింగులు.. ఫైటింగులతో మోత మోగిపోయింది. చాలా వరకు క్లాస్ గా.. సటిల్ గా సాగే సినిమాలో మాస్ ప్రేక్షకులను అలరించేది ఈ యాక్షన్ ఘట్టాలే. హీరో ఎలివేషన్లు కూడా బాగానే పడడం.. యాక్షన్ సన్నివేశాలు పేలిపోవడం.. వాటికి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్.. విజువల్స్ తోడవడంతో అవి కోరుకునే ప్రేక్షకులకు పండగన్నట్లే. కానీ కొన్ని సన్నివేశాల్లో సాగతీత.. హీరో ఫ్లాఫ్ బ్యాక్ పండకపోవడం వల్ల రివెంజ్ తాలూకు ఎమోషన్ క్యారీ కాకపోవడం మైనస్ అయ్యాయి. భారీ యాక్షన్ ఘట్టం తర్వాత సినిమాను ముగించడానికి కూడా లోకేష్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. విక్రమ్-2కు హింట్ ఇస్తూ.. అందులో ప్రధాన విలన్ గా సూర్యను పరిచయం చేస్తూ సినిమాను ముగించడం ఎగ్జైటింగ్ గా అనిపించినా.. ద్వితీయార్ధం మరీ లెంగ్తీగా అనిపించి సినిమా మీద ఇంప్రెషన్ ను తగ్గిస్తుంది. కానీ లోకేష్ మార్కు యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి.. కమల్ అభిమానులకు ‘విక్రమ్’ మస్ట్ వాచ్ ఫిలిమే. మిగతా వాళ్లు ఈ సినిమాతో కొంత నిరాశ చెందొచ్చు.
నటీనటులు:
కమల్ హాసన్ కెరీర్లో చేసిన ఎన్నో అద్భుత పాత్రలతో పోలిస్తే ‘విక్రమ్’ పాత్ర అంత ప్రత్యేకమైంది కాదు. కానీ గత పది పదిహేనేళ్లలో ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే మాత్రం ఇది అభిమానులను అలరించేదే. కమల్ ను ఈ వయసులో ఇలాంటి యాక్షన్ ప్రధాన సినిమాలో చూసి అభిమానులు థ్రిల్లవుతారు. కమల్ స్క్రీన్ ప్రెజెన్స్.. కొన్ని సన్నివేశాల్లోనే అయినా ఎమోషన్లు పలికించాల్సిన చోట ఇచ్చిన హావభావాలు తన స్థాయిని తెలియజేస్తాయి. ఐతే వయసు ప్రభావం వల్ల చాలా చోట్ల ఆయన బదులు డూప్ తో చేయించిన యాక్షన్ ఘట్టాలు నమ్మశక్యంగా అనిపించవు. ఈ విషయంలో లోకేష్ జాగ్రత్త పడాల్సింది. ఆయన గొంతు మీద కూడా వయసు ప్రభావం పడి డబ్బింగ్ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ మధ్య వరుసగా పేలవమైన పాత్రలతో నిరాశ పరుస్తున్న విజయ్ సేతుపతికి మళ్లీ తన రేంజికి తగ్గ పాత్ర పడింది ఈ చిత్రంతో. సంతానం పాత్రలో అతను అదరగొట్టాడు. తన లుక్.. మేనరిజమ్స్ బాగున్నాయి. నటన గురించి చెప్పాల్సిన పని లేదు. ఫాహద్ ఫాజిల్ కూడా బాగా చేశాడు. కాకపోతే అతడి స్థాయికి ఇంకా మెరుగైన పాత్రను ఆశిస్తాం. ద్వితీయార్ధంలో ఫాహద్ పాత్ర నామమాత్రంగా మారిపోయింది. చెంబన్.. నరేన్.. ఇలా మిగతా నటీనటులంతా బాగానే చేశారు. క్యామియోలో సూర్య మెరిశాడు.
సాంకేతిక వర్గం:
‘విక్రమ్’ సినిమాకు సంబంధించి ది బెస్ట్ ఇచ్చింది ఎవరు అంటే మరో మాట లేకుండా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. సినిమా నడతను.. అందులో విషయాన్ని బట్టి నేపథ్య సంగీతం అందించే అనిరుధ్.. ‘విక్రమ్’ను తన నేపథ్య సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇంత స్టైలిష్.. ఎగ్జైటింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకెవ్వరూ ఇవ్వలేరు అనిపించేలా అతను ప్రతి సన్నివేశంలోనూ అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్లలో.. యాక్షన్ ఘట్టాల్లో స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ఉన్న చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం కూడా ఉన్నత స్థాయిలో సాగింది. లోకేష్ అభిరుచికి తగ్గట్లుగా అతను విజువల్స్ అందించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ‘మాస్టర్’ తర్వాత మళ్లీ గాడిన పడ్డాడు. తన మార్కు సినిమా తీశాడు. కాకపోతే ‘ఖైదీ’ స్థాయిలో బెస్ట్ ఔట్ పుట్ మాత్రం ఇవ్వలేదు. అందుక్కారణం.. ఇందులో ఎమోషనల్ కనెక్ట్ తగ్గడం.. కొంత సాగతీత. కానీ ఒక అభిమానిగా కమల్ ను ఫ్యాన్స్ మెచ్చేలా ప్రెజెంట్ చేయడంలో అతను విజయవంతం అయ్యాడు.
చివరగా: విక్రమ్.. యాక్షన్ మోత.. ఎమోషన్ కొరత
రేటింగ్-2.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater