ఖుషి.. రొమాంటిక్ గా మొదటి స్టెప్ ఫినిష్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీలతో మంచి గుర్తింపును అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమాపై టైటిల్ తోనే అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

కానీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బిజీగా ఉండటం వలన చాలా ఆలస్యంగా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక మొదటి షెడ్యూల్ ను ఇటీవల మొదలు పెట్టారు. ఇక ఆ షెడ్యూల్ ను చాలా వేగంగా పూర్తి చేశారు. పర్ఫెక్ట్ రొమాంటిక్ స్క్రిప్ట్ తో రెడీ అయిన డైరెక్టర్ శివ నిర్మాణం ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఇటీవల కాశ్మీర్ లో మొదలుపెట్టారు. ఇక అనుకున్న టైమ్ కంటే చాలా వేగంగా పూర్తి చేశారు. రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలి అని కాశ్మీర్లోని లోకల్ ప్లేస్ లలో అందమైన లొకేషన్స్ లో సినిమా మొదటి షెడ్యూల్ ను అనుకున్నట్లుగా రిలీజ్ చేయడం జరిగింది.

ఇక షూటింగ్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లైగర్ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నప్పటికి కూడా మళ్లీ ఇలాంటి రొమాంటిక్ లవ్ సినిమాతో వస్తున్నాడు అంటే అతను ఎంతో నమ్మకంగా ఉన్నాడో చెప్పవచ్చు.

ఇక తదుపరి షెడ్యూల్ ను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి అని ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని దర్శకుడు ముందుగానే తెలియజేశాడు.

ముఖ్యంగా సమంత విజయ్ దేవరకొండ లిప్ లాక్ సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ స్టార్ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×