మరో మల్టీ స్టారర్ గురించి మహేష్ రియాక్షన్

టాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం మల్టీ స్టారర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ విజయాలను మల్టీ స్టారర్ సినిమాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో తప్పకుండా ముందు ముందు మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మల్టీ స్టారర్ సినిమాల గురించి చాలా పాజిటివ్ గా స్పందించాడు. గతంలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమా లో వెంకటేష్ తో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మళ్లీ మల్టీ స్టారర్ సినిమాల విషయంలో పెద్దగా ఆసక్తిని కనబర్చినట్లుగా అనిపించలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ బాబు మల్టీ స్టారర్ సినిమాల పై ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పకుండా మంచి కథలతో వస్తే నటించేందుకు సిద్దం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మల్టీ స్టారర్ ల విషయంలో తాను ఆసక్తిగా ఉన్నట్లుగానే మహేష్ బాబు వ్యాఖ్యలు చేయడం తో ముందు ముందు ఆయన నుండి ఖచ్చితంగా మల్టీ స్టారర్ సినిమా లు వస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు కూడా ఆ దిశగా ఆలోచన లు చేస్తున్నాడు. ఆయన తో సినిమా అంటే ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మంచి కథ.. ఇద్దరు హీరోలకు సరైన ప్రియారిటీ లభిస్తే తప్పకుండా సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మహేష్ బాబు ఏ హీరోతో మల్టీ స్టారర్ చేయాలని ఆన్ లైన్ లో ఒక మీడియా సంస్థ పోల్ నిర్వహించగా ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాన్ మరియు ఎన్టీఆర్ ల పేర్లను సూచించారు. ఆ ఇద్దరితో కాకున్నా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక హీరోతో మహేష్ బాబు సినిమా చేయాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమా నుండి బయటకు వచ్చేందుకు వెకేషన్ కు వెళ్లాడు. అక్కడ నుండి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి త్రివిక్రమ్ గత కొన్ని నెలలుగా మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివరి వరకు ఆ సినిమాను పూర్తి చేసి వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు చేస్తాడు. ఆ తర్వాత మల్టీ స్టారర్ ఉంటుందేమో చూడాలి.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×