బొమ్మరిల్లు భాస్కర్ తో నాగ చైతన్య రంగంలోకి!

యువ సామ్రాట్ నాగచైతన్య ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. 'లవ్ స్టోరీ'..'బంగార్రాజు' తో వరుస విజయాలు అందుకున్న చైతన్య మరో సక్సెస్ తో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ'లో నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

సినిమాపై భారీ అంచనాలున్నాయి. 'విక్రమ్'..  'మనం'..'హలో' వంటి హిట్  చిత్రాలతో అక్కినేని హీరోలకు ఫ్యావరెట్ మేకర్ అయ్యారు.   అక్కినేని కాంపౌండ్ కి సెంటిమెంట్ దర్శకుడిగానూ మారిపోయారు. ఆ నమ్మకంతోనే మరోసారి చైతన్య  విక్రమ్ తో మూవ్ అవుతున్నారు. జులై 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

దీంతో చైతన్య తదుపరి ప్రాజెక్ట్ లు తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే కోలీవుడ్ మేకర్ వెంటకర్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా లాక్ చేసారు.  ఇది తెలుగు..తమిళ్ లో తెరకెక్కుతుంది. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఇటీవలే మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న పరశురాంతో కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

వాస్తవానికి ఈ చిత్రం 'సర్కారు వారి పాట' కంటే ముందుగానే తెరకెక్కాలి. కానీ అనివార్య కారణాల వల్ల డిలే అయింది. వెంకట్ ప్రభు సినిమాతో పాటు ఈ చిత్రాన్ని లాంచ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. తాజాగా చైతన్య మరో కొత్త ప్రాజెక్ట్ కూడా తెరపైకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో  ఓ సినిమా చేయడానికి  ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ముందు కమిట్ మెంట్లు పూర్తిచేసిన తర్వాత చైనత్య -భాస్కర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇటీవలే భాస్కర్  అక్కినేని హీరో అఖిల్ కి 'మోస్ట్  ఎలిజిబుల్  బ్యాచ్ లర్' తో సక్సెస్ ఇచ్చి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ కి ఇదే సిసలైన సక్సెస్ గా నిలిచింది.

దీంతో నాగచైతన్య - భాస్కర్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. 'ఒంగోలు గిత్త' తర్వత భాస్కర్ కి మరో ఛాన్స్ రాలేదు. దాదాపు ఏడేనిమిది సంవత్సరాలు పాటు ఖాళీగానే ఉన్నారు. అదే సమయంలో అఖిల్- అల్లు అరవింద్ భాస్కర్ ని తెరపైకి తీసుకొచ్చారు. వాళ్లిద్దరి నమ్మకాన్ని సదరు మేకర్ నిలబెట్టారు. ఇప్పుడా నమ్మకంతోనే చైతన్య రంగంలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం చైతన్య 'థాంక్యూ'  పోస్ట్  ప్రొడక్ష పనుల్లో  ఉన్నాడు. అవి పూర్తయిన వెంటనే వెంకట్ ప్రభు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
× RELATED ఇద్దరిలో 'పాన్ ఇండియా స్టార్' అనిపించుకునేదెవరు..?
×