ఫ్యాన్స్ కోరికను ఆ రెండు చిత్రాలతో తారక్ తీర్చేస్తాడా?

సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలనుకుంటే మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వాల్సిందే. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీడ్లో కొనసాగుతున్న హీరోలంతా మాస్ జనానికి దగ్గరైన వారే. అందుకే హీరోలు కెరీర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసినా ఆ తర్వాత మాత్రం మాస్ మంత్రమే జపిస్తుంటారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మంచి మాస్ ఇమేజ్ ఉంది. కానీ ఈయన నుంచి సరైన మాస్ చిత్రం వచ్చి చాలా కాలం అయింది. టెంపర్ జనతా గ్యారేజ్ అరవింద సమేత వీర రాఘవ సినిమాల్లో మాస్ ప్రేక్షకులు మెచ్చే పలు అంశాలు ఉన్నా వీటిని పూర్తిస్థాయి మాస్ సినిమాలుగా పరిగణించలేము.

అయితే తిరుగులేని మాస్ హీరోగా తారక్ అవతరించాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరికను తారక్ తన తదుపరి చిత్రాలతో తీర్చేసేలాగా కనిపిస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత తారక్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఆర్ఆర్ఆర్ అందించిన హిట్ తో ఫుల్ జ్యోష్ లో ఉన్న తారక్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కొరటాల శివతో అనౌన్స్ చేశాడు.

`ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్ లో నిర్మించబోతున్నాయి. ఇది పక్కా మాస్ మూవీగా తెరకెక్కబోతోందని.. ఇటీవల బయటకు వచ్చిన మోషన్ పోస్టర్ వీడియోతో స్పష్టమైంది. అలాగే ఈ మూవీ అనంతరం `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తన 31వ చిత్రాన్ని చేయబోతున్నాడు తారక్.

మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ మూవీ నిర్మితం కానుంది. `ఎన్టీఆర్ 31` వర్కింగ్ టైటిల్ తో మూడు రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా తారక్ ప్రీ లుక్ ను సైతం బయటకు వదలగా.. అందులో ఆయన ఇంటెన్స్ లుక్ లో ఫుల్ యాంగ్రీగా కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు. ఇది కూడా ఊరమాస్ సినిమాగా తెరకెక్కనుందని ప్రీ లుక్ పోస్టర్ తోనే క్లారిటీ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. తారక్ ను ఎలాగైతే చూడాలని భావిస్తున్నారో.. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ 30 31 ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ రెండు మాస్ చిత్రాలు అంచనాలకు మించి విజయం సాధిస్తే.. తిరుగులేని మాస్ హీరోగా తారక్ అవతరించడం ఖాయమవుతుంది. దాంతో అభిమానుల కోరిక నెరవేరుతుంది.
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×