అడపులి అయినా క్లిక్ అవుతుందా

బిగ్ బాస్ ఎన్ని కాంట్రవర్సీలు కు దారితీసిన కూడా ఫైనల్ గా జనాలను ఆకట్టుకోవడంలో మాత్రం ఎల్లప్పుడూ తన స్థాయిని పెంచుకుంటూనే ఉంది. భాషతో సంబంధం లేకుండా కొనసాగుతున్న ఈ రియాలిటీ షో ద్వారా కొంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి అవకాశం లభిస్తుంది అని చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అనుకునే కొంతమంది బిగ్ బాస్ ద్వారా మళ్లీ కెరీర్ ను సెట్ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. టైటిల్ విన్నర్ గా నిలవడానికి వారి క్యారెక్టర్ ను కూడా తగ్గించుకొని బిగ్ బాస్ మోసాలకు కూడా కొన్నిసార్లు జనాల్లో బ్యాడ్ కావాల్సి వస్తుంది.

అయినా కూడా బిగ్ బాస్ విన్నర్ అయితే మాత్రం మంచి క్రేజ్ తో పాటు ఆదాయం పరంగా కూడా కంటెస్టెంట్స్ లాభాల్లో ఉంటారు అనే చెప్పాలి. అయితే తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇంతవరకు ఫైనల్ ఎపిసోడ్ లో గెలిచిన విన్నర్స్ కు మాత్రం కెరీర్ పరంగా పెద్దగా సెట్ అయ్యింది లేదు.

మొదటి సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచిన శివబాలాజీ ఒకటి రెండు సినిమాలలో తప్పితే పెద్దగా అవకాశాలు అందుకోలేదు. ఇక ఆ తర్వాత రెండవ సీజన్ లో కౌశల్ మండా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కానీ అతని దూకుడు కేవలం బిగ్ బాస్ 2 వరకే పరిమితం అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. మూడవ సీజన్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవ్వకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ సీజన్ 4 లో టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అతనికి కూడా అవకాశాలు వచ్చాయి కానీ వాటిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక 5వ సీజన్లో విజే సన్నీ విన్ అవుతాడు అని ఎవరూ ఊహించలేదు. ఇక అతన్ని మళ్లీ జనాలు గుర్తుపట్టాలి అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఏదేమైనా కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన వారి కంటే మిగతా కంటెస్టెంట్ ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు కనీసం ఆడపులి అయినా హీరోయిన్ గా మళ్లీ నిలదొక్కుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనేది తెలుగులో పెద్దగా కలిసి రావడం లేదు. మరి ఆ సెంటిమెంట్ ను ఈ బ్యూటీ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
× RELATED పేరున్న డైరెక్టర్..పాన్ ఇండియా మూవీ..బజ్ జీరో!
×