F3 ఈవెంట్లో అగ్గి రాజేసిన సోనాల్ చౌహాన్

ఓవైపు ఎఫ్ 3 లైవ్ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు ఫోటోగ్రాఫర్లు ఆ వేదిక వద్ద ఒక అందాల దేవతను ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. తన అందమైన డిజైనర్ ఒంపుసొంపులను తీరిగ్గా ఫోటోలు తీసేందుకు సంసిద్ధులయ్యారు. ఇప్పుడు ఆ ఫోటోలు అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో వైరల్ గా మారాయి.

సోనాల్ వైట్ అండ్ వైట్ డిజైనర్ శారీలో వేదిక వద్ద అదరగొట్టింది. సాటి నాయికలతో పోటీపడుతూ ఎఫ్ 3 వేదికకే సోనాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెహ్రీన్ ఓ వైపు బ్లాక్ పర్పుల్ డ్రెస్ లో దేవతలా ప్రత్యక్షమైనా కానీ ఆ వేదిక వద్ద కళ్లన్నీ సోనాల్ వైపే వాలాయంటే అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

విక్టరీ వెంకటేష్- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి జోడీ కట్టి ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ `ఎఫ్ 3`తో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 27 మే 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.

తమన్నా భాటియా- మెహ్రీన్ పిర్జాదా - సోనాల్ చౌహాన్ F3 లో కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్- సునీల్ ఇతర తారాగణం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎఫ్ 3 సింగిల్స్ కి శ్రోతల నుంచి అద్భుత స్పందన లభించింది. ట్రైలర్ వెబ్ లో దూసుకెళ్లింది.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×