ఎన్టీఆర్ 30పై ఆ సస్పెన్స్ వీడినట్టేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' తరువాత తన 30వ సినిమాని మొదలెట్టబోతున్నాడంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించడం మొదలైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఈ మూవీని చేయబోతున్నామని ఏడాది క్రితమే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు కూడా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కినేని సుధాకర్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి తాజాగా సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసి అభిమానులని సర్ ప్రైజ్ చేశారు. అంతే కాకుండా ఈ మూవీని ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు కూడా. మోషన్ పోస్టర్ ని ఐదు భాషల్లో విడుదల చేస్తే మలయాళం మినహా అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్ తన డైలాగ్ లని వినిపించారు.

ఇదిలా వుంటే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది. 'ట్రిపుల్ ఆర్' రిలీజ్ కు ముందు ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వనిపించాయి.

తనే ఇందులో నటిస్తోందంటూ పలు వార్తా కథనాలు పుట్టుకొచ్చాయి. అలియా భట్ కూడా ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా దృవీకరించింది కూడా. దీంతో ఈ మూవీలో అలియానే హీరోయిన్ అని అంతా ఫిక్సయ్యారు. అయితే సినిమా లేట్ కావడం ఇదే సమయంలో అలియాభట్ పెళ్లి జరిగిపోవడం ఓ హాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి అలియా తప్పుకుంది.

అక్కడి నుంచి ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుందనే వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలని జాన్వీ కండించింది. తాను తెలుగులో ఏ సినిమా అంగీకరించలేదని స్పష్టం చేసింది.  జాన్వీ క్లారిటీ ఇవ్వడంతో సాయి పల్లవిని ఫైనల్ గా తీసుకున్నారంటూ మరో వార్త హల్ చల్ చేయడం మొదలు పెట్టింది. ఈ వార్త కూడా గాలి వార్తేనని ప్రొడక్షన్ హౌస్ వర్గాల నుంచి ఓ వార్త బయటికి రావడంతో ఎన్టీఆర్ 30లో హీరోయిన్ ఎవరు? అనే కన్ఫ్యూజన్ మళ్లీ మొదటికి వచ్చింది.

ఇదిలా వుంటే ఈ మూవీని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇందులో బాలీవుడ్ మీరోయిన్ లయితే బాగుంటుందని దర్శకుడు భావించాడని ఆ కారణంగానే బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీని ఫైనల్ గా ఎంపిక చేసుకున్నారంటూ కొత్త వార్త చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. ఇందులో వున్న నిజమెంటక్ష తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. లేదంటే ఇది కూడా మరో పుకారుగా మారి ఎన్టీఆర్ 30 హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే వుంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×