బంగ్లా యువతిపై దారుణ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు

ఐటీ హబ్ బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. యువతిపై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఆమె సున్నితమైన మర్మాంగాల్లో బ్లేడ్ లతో కోసి.. బీరు బాటిల్స్ పెట్టి సామూహిక అత్యాచారాలు చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది.  నిందితులు గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియో ఆధారంగా కామాంధులు కిరాతకులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

బంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలికి కోర్టు 20 ఏళ్లు శిక్ష విధించింది. ఈ కేసులో కొంతమందికి తక్కువ శిక్ష పడిందని బెంగళూరులోని రామమూర్తి నగర పోలీసులు మీడియాకు చెప్పారు.

బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు బంగ్లాదేశ్కు చెందిన వారు నివాసం ఉండేవారు. 2021 మే 27వ తేదీన రామమూర్తి నగర్ లోని బంగ్లాదేశ్కు చెందిన కొందరు మద్యం పార్టీ చేసుకున్నారు. ఇదే లిక్కర్ పార్టీకి బంగ్లాదేశ్ కు చెందిన 23 ఏళ్ల యువతి హాజరైంది. లిక్కర్ పార్టీ జరిగిన తర్వాత అక్కడ సీన్ మొత్తం మారిపోయింది.

మద్యం మత్తులో ఉన్న కొందరు యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారు. యువతిని నిర్బంధించిన తర్వాత  ఆమె మీద ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేయడమే కాకుండా ఆమె సున్నితమైన భాగాల్లో బ్లేడ్ లతో కలిసి.. ఆమె మర్మాంగంలో బీరు బాటిల్స్ చెక్కి సామాహిక అత్యాచారం చేశారు. యువతి మీద అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేపింది.

గ్యాంగ్ రేప్ నకు గురైన యువతి ప్రాణభయంతో కేరళ పారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి చివరికి నిందితులను పట్టుకున్నారు.

వీడియో ఆధారంగా కామాంధులు కిరాతకులకు బెంగళూరులో కోర్టు యవజ్జీవ కాగారార శిక్ష విధించింది. బంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలికి కోర్టు 20 ఏళ్లు శిక్ష విధించింది.
× RELATED కోటం రెడ్డి బిగ్ వాయిస్ : అభివృద్ధి లేదు... ఎవరూ పట్టించుకోరు...
×