సోషల్ మీడియా టాక్స్ : పొత్తులు వద్దట ! పసుపు దండులో కలవరమాయె!

తెలుగుదేశం పార్టీలో పొత్తులు వద్దే వద్దని ఓ సంచలన ప్రతిపాదన వైరల్ అవుతోంది. సోషల్ మీడియా టాక్స్ లో ఇదే వినపడుతోంది. ఎందుకంటే ఒంటరిగాపోయి రాజ్యాధికారం సాధిస్తే జగన్ ను ఎదిరించిన వైనం ఒకటి జనంలోకి బాగా పోతుందని అంతేకానీ 2014 ఈక్వేషన్ నే రిపీట్ చేయడం ఎందుకని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పొత్తుల కారణంగా లాభం కన్నా నష్టమే ఎక్కువ అన్న వాదన కూడా వస్తోంది. అయినా పదే పదే వాళ్లు సింహం సింగిల్ గానే వస్తుందని అంటున్నారు కనుక మనం కూడా అదేవిధంగా వెళ్లి విజయమో లేదా వీర స్వర్గమో తేల్చుకుందాం అని ఇంకొందరు పసుపు సైనికులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ నాయకత్వం అయితే పరిశీలిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు నిన్న లోకేశ్ వచ్చి వెళ్లారు.

ఆయన రాకతో డీ యాక్టివ్ గా ఉన్న లీడర్లు ఒక్కసారిగా యాక్టివ్ మోడ్ లో కి వచ్చారు. కళా వెంకట్రావు కొండ్రు మురళి లాంటి లీడర్లు కాస్త యాక్టివ్ అయ్యారు. ఎచ్చెర్లో కళా తో పాటు అధికార ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కూడా సమాన స్థాయిలో వ్యతిరేకతను మోస్తున్నారు.

ఈ తరుణాన పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తే టీడీపీ ఇక్కడ పోటీ చేయడం కష్టమే ! అందుకే పొత్తు ఏ విధంగా మేలు అన్నది ఆలోచించాలి అని అంటున్నారు. అలా కాకుండా కళాకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఓ ఆలోచన వినిపిస్తోంది.

ఒకనాటి జర్నలిస్టు ఎర్రన్న అనుచరుడు కలిశెట్టి అప్పలనాయుడు నియోజకవర్గంలో బాగానే తిరుగుతున్నారు. చౌదరి బాబ్జీ లాంటి లీడర్లు కూడా తమకు కానీ తాము మద్దతు ఇచ్చే వారికి కానీ టికెట్ ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఇదేవిధంగా పొరుగు జిల్లా కు చెందిన రాజాంలోనూ రాజకీయం నెలకొన్నది.

అదే స్థాయిలో ఇచ్ఛాపురం కూడా  కొత్త ముఖాలు కానీ లేదా లోకేశ్ కానీ పోటీ చేస్తే బాగుంటుంది అని ఓ ప్రతిపాదన ఉంది. కనుక పొత్తులలో భాగంగా నష్టం ఎక్కువ మరియు లాభం తక్కువ అన్న వాదన ఉంది కనుక కొందరు ఎల్లో వారియర్స్ పొత్తులు వద్దు అని కొత్త ముఖాలకు ఎక్కువగా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని ఓ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఇదే విధంగా విజయనగరంలో కూడా తెలుగు యువత కుర్రాళ్లకు మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. విశాఖలో గంటా లాంటి లీడర్లు సైలెంట్ అయిపోయారు కనుక ప్రతిపాదిత స్థానాల్లో ఆయనకు ప్రత్యామ్నాయ రీతిలో కొత్త నాయకత్వంకు అధినేత మద్దతు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి అని పాత తరం కన్నా కొత్త తరమే బాగా మాట్లాడుతోందని కూడా అంటున్నారు కొందరు తెలుగుదేశం అభిమానులు. కనుక పొత్తులు వద్దనుకుని కొత్త గొంతుకలకు అవకాశాలు ఇవ్వాలని వేడుకుంటోంది.. టీడీపీ అభిమాన గణం.
× RELATED కోటం రెడ్డి బిగ్ వాయిస్ : అభివృద్ధి లేదు... ఎవరూ పట్టించుకోరు...
×