యంగ్ హీరో ఏకంగా ప్రొడ్యూసర్ కే షాకిచ్చాడు

సినిమా ఎప్పుడు ఎవరి జీవితాల్ని ఎలా టర్న్ చేస్తుందో ఇక్కడ ఎవరికీ తెలియదు. ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోయే ఈ రంగంలో ఏదైనా జరగొచ్చు.. ఎలాంటి విచిత్రాలైన వెలుగు చూడొచ్చు. రాత్రికి రాత్రే సినిమా ఫలితంలో సమీకరణాలు మారిపోవచ్చు.. అంతకు ముందు అనుకున్న ఒప్పందాలు మారొచ్చు.. కొత్త డిమాండ్ లు పుట్టుకు రావొచ్చు. అవన్నీ భరించని వారికి షాకులు తప్పని సరిక్కడ. ఇలాంటి ఓ షాక్ నే ఓ యంగ్ రెబల్ హీరో ఏకంగా ప్రొడ్యూసర్ కు ఇచ్చారు.

అది ఇప్పడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఓ రెబల్ యంగ్ హీరో. అందు కోసం ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు.

కథ కథనాలు కొత్తగా వుండటంతో ఈ మూవీ ఫస్ట్ టీజర్ నుంచే మంచి టాక్ ని బజ్ ని క్రియేట్ చేసింది. అయితే పెద్ద సినిమాల జోరులో తన సినిమాని చూడటానికి ఎవరొస్తారని గ్రహించిన సదరు రెబల్ హీరో పబ్లిసిటీ జిమ్మిక్కులు చేసి ఓ వీడియోతో హల్ చల్ చేశాడు.

అది కాస్తా వైరల్ కావడం.. వివాదాన్ని సృష్టించింది. ఇదే అతని సినిమాని అందరి దృష్టిలో పడేలా చేసింది. మూవీ రిలీజ్ అయింది. మంచి టాక్ ని తెచ్చుకుంది. అయితే వసూళ్లు మాత్రం ఆ రేంజ్ లో లేవు. అయినా యంగ్ హీరో ఏ మాత్రం తగ్గేదిలే అనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా తన నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ కే షాకిచ్చాడు.

తన ప్రీవియస్ మూవీ రిలీజ్ కు ముందు ఓ సినిమాని అంగీకరించిన సదరు రెబల్ హీరో ముందు కోటిన్నర నుంచి 2 కోట్లు డిమాండ్ చేశాడు. అయితే ఎప్పుడైతో తన సినిమా హిట్ టాక్ తెచ్చుకుందో అప్పుడే తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచేశాడట. ఇదే తనకు కావాలని ప్రొడ్యూసర్ ని డిమాండ్ చేయడంతో ముందు అనుకున్న ప్రకారం మాత్రమే ఇస్తానని 3 కోట్లు తాను ఇవ్వలేనని సదరు నిర్మాత ఓపెన్ గా చెప్పేశాడట.

దీంతో రెబల్ హీరో ఏకంగా ప్రొడ్యూసర్ నే మార్చేసి తానే నిర్మాతగా డైరెక్టర్ గా నెక్స్ట్ సినిమాకు రెడీ అయిపోతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రేడ్ వర్గాలు మాత్రం యంగ్ రెబల్ హీరోకే సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. తన సినిమాకు బజ్ ని క్రియేట్ చేయడమే కాకుండా కంటెంట్ బాగుండేలా చూసుకుంటున్నాడని అలాంటప్పుడు అతను 3 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పులేదని అతనికి కళ్లు మూసుకుని 3 కోట్లు ఇవ్వొచ్చని చెబుతున్నారట.
× RELATED సూపర్ హీరో `థోర్`కి సాయితేజ్ ప్రమోషన్
×