మొదటి సారి భార్య గురించి థమన్.. ఆమెతో కలిసి చేయాలనేది డ్రీమ్!

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనగానే ఠక్కున వినిపించే పేర్లలో థమన్ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోలకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. దేవి శ్రీ ప్రసాద్ కన్నా కూడా ఎక్కువ సినిమాలను థమన్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకు పోతున్నాడు. థమన్ తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కుమ్మేశాడు.

సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న థమన్ మరో వైపు బాలకృష్ణ 107వ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలే కాకుండా పవన్ తదుపరి సినిమాల్లో రెండు సినిమాలకు కూడా థమన్ సంగీతాన్ని ఇవ్వబోతున్నాడు. చిరంజీవితో కూడా ఒక సినిమా కోసం వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత బిజీగా ఉన్న థమన్ ఎన్నో ఇంటర్వ్యూల్లో షో ల్లో పాల్గొంటూ ఉంటాడు.

సినిమాలకు సంగీతాన్ని ఇచ్చానా.. వెళ్లి పోయానా అన్నట్టుగా కాకుండా ఆ సినిమాల ప్రమోషన్ లో తనదైన పాత్రను థమన్ పోషిస్తూ ఉంటాడు. అలా ఎన్నో చోట్ల కనిపిస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉన్నా కూడా తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇంకా చాలా మంది థమన్ కు పెళ్లి కాలేదనే అభిప్రాయంలో ఉన్నారు.

థమన్ కు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యింది. ప్లే బ్యాక్ సింగర్ వర్ధిని ని థమన్ పెళ్లి చేసుకున్నాడు. గతంలో వర్ధిని పలువురు సంగీత దర్శకుల వద్ద ప్లే బ్యాక్ సింగర్ గా చేసింది. థమన్ సంగీతం లో కూడా ఆమె పాటలు పాడింది. కాని అవి పెద్దగా సక్సెస్ అవ్వక పోవడంతో వర్ధిని గురించి జనాల్లో అవగాహణ లేదు.

తాజాగా థమన్ సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్య వర్ధిని గురించి స్పందించాడు. తన భార్య వర్ధిని వాయిస్ బాగుంటుంది. ఆమె వాయిస్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలకు నచ్చి.. వర్ధినితో పాడిస్తే బాగుంటుందని భావిస్తే తప్పకుండా ఆమెతో పాడిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. వర్ధినితో స్టేజ్ షో లు చేయాలి అనేది నా డ్రీమ్ అంటూ థమన్ పేర్కొన్నాడు.

వర్ధినితో స్టేజ్ షో లు చేయడానికి ముందు ఆమె మూడు నాలుగు పాటలతో హిట్ అవ్వాలి. ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తామంటూ థమన్ పేర్కొన్నాడు. ఇక కొడుకు గురించి స్పందిస్తూ నా ట్యూన్స్ ను మొదట వాడే వింటాడు. అప్పుడే వాడికి పలు మ్యూజిక్ పరికరాలపై అవగాహణ ఉందని థమన్ పేర్కొన్నాడు.
× RELATED రాపోని ఆశీర్వదించిన శంకర్-మణిరత్నం
×