పిక్ టాక్ : ఈ ఒక్క క్లిక్ తో పుకార్లన్నింటికి నిహారి చెక్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి జరిగి ఎన్నో సంవత్సరాలు కూడా కాలేదు. అప్పుడు నిహారిక భర్త నుండి విడి పోయింది.. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరిని కలిపి ఉంచేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఇద్దరు కలిసి ఉండే అవకాశం కనిపించడం లేదు అంటూ మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది అంటూ కొన్నాళ్ల క్రితం ప్రముఖ మీడియాల్లో కూడా వార్తలు వచ్చాయి.

నిహారిక మరియు చైతన్యలు విడి పోయారా అనే విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆ మద్య డ్రగ్స్.. నైట్ పార్టీ ఇతర కారణాల వల్ల మీడియాలో నిలిచిన నిహారిక కోసం చైతన్య రాలేదు.. స్పందించలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. వారిద్దరు విడిపోయారు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలంటూ కామెంట్స్ చేయడం జరిగింది.

ఇప్పుడు నిహారిక ఈ ఫోటో ను షేర్ చేయడం తో మొత్తం పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది. నిహారిక కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంది.

దాంతో ఆమె ను రకరకాలుగా కొందరు కామెంట్స్ చేశారు. వాటన్నింటికి కూడా ఈ ఒక్క క్లిక్ తోనే నిహారిక సమాధానం చెప్పినట్లయ్యింది. నిహారిక ఒక రొమాంటిక్ ఫోటోను షేర్ చేయడం ఇదే మొదటి సారి అంటూ చర్చ జరుగుతోంది.

మొత్తానికి నిహారిక నుండి ఇలాంటి ఒక క్లారిటీ రావడంతో మెగా అభిమానులు ముఖ్యంగా నిహారికతో పాటు నాగబాబు ను అభిమానించే వారికి ఊరట దక్కినట్లు అయ్యింది. ఇటీవలే నిహారిక ఒక సినిమాను ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ తో కలిసి ఆ సినిమాను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

నిహారిక వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. ఎప్పటికి మన బందం ఇలాగే ఉండాలంటూ నిహారిక ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా ఇద్దరు కలిసే ఉన్నారంటూ క్లారిటీ వచ్చేసింది. అభిమానులు మరియు నెటిజన్స్ కూడా మీరు ఎప్పుడు ఇలాగే రొమాంటిక్ కపుల్ గా పేరు దక్కించుకుని కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×