భానుడి సెగల్లో రకుల్ ధగధగలు!

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్  టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన గ్లామ్ షో తో ఇన్ స్టాని హీటెక్కించడం అమ్మడి ప్రత్యేకత. డిజైనర్ వేర్స్ తో పాటు..అవసరం మేర బోర్డర్ క్రాస్ చేసిన డిజైనర్ దుస్తుల్లోనూ  కాకలు రేపుతుంది. బికినీ...టూపీస్ వంటి వాటిలోనూ అరితేరిపోయింది. కెరీర్ ఆరంభంలో కొన్ని నిబంధనలు విధించుకున్నా ఇప్పుడు వాటిని పూర్తిగా సడిలించి  ముందుకు సాగుతుంది.

తాజాగా రకుల్  కొత్త ఫోటో ఒకటి  అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇందులో రకుల్ డిజైనర్ గౌనులో తళుక్కున మెరిసింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో మనోహరంగా కనిపిస్తుంది. సరిగ్గా సూర్యుడి నడి నెత్తిన ఉన్నసమయంలో తిసిన ఫోటో ఇది. దీంతో ఎండ తీవ్రత స్పష్టంగా గమనించవచ్చు. రకుల్ ముఖం..శరరీంపై ఎండ తీవ్రంగా పడుతోన్న సమయంలో తీసిన స్పాప్.

కెమెరా క్యాప్చర్ కి పర్పెక్ట్ గా ఉంటుందనే ఇలాంటి టైమింగ్ ని చూజ్ చేసుకుని ఉండొచ్చు.  సరిగ్గా సముద్రం పోర్టు తీరాన ఈ ఫోటో క్యాప్చర్ చేసారు. ఇందులో డిజైనర్ డ్రెస్  మాత్రమే హైలైట్  అవుతుంది.  రకుల్  గ్లామర్ ఎలివేషన్లకి ఏమాత్రం స్కోప్ లేదు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఈ మాధ్యమంలో రకుల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.

డే బై డే రకుల్  అనుచర గణం మరింత  పెరుగుతుంది. దీంతో అమ్మడు ఇన్ స్టా లో యాక్టివ్ గా పాల్గొంటుంది. నిత్యం ఏదో అప్ డేట్ ఉండేలా జాగ్రత్త పడుతుంది. వీలైనంత వరకూ ఫోటో సెషన్లపైనే ఎక్కువ  ఏకాగ్రత తో పనిచేస్తుంది. ఇటీవలే అమ్మడు మాల్దీవుల వెకేషన్ ఫోటోలతో ఇన్  స్టాని షేక్ చేసింది.  వాటికి సోషల్ మీడియాలో మంచి లైక్స్ ..షేర్ దక్కాయి.

ఇక రకుల్ లైనప్ చూస్తే  బాలీవుడ్ లో  బిజీగా ఉంది. అక్కడ `డాక్టర్ జీ` అనే  సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది.  అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో  కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. `ఎటాక్`..`రన్ వే`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది`.

వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది.  తెలుగులో `31 అక్టోబర్  లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×