అంతర్జాతీయ వేదికపై ఫస్ట్ టైమ్ మన స్టార్స్

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు మరియు సినీ మీడియా వారు ప్రత్యేక శ్రద్ద పెట్టే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 ఎడిషన్ కు రంగం సిద్దం అయ్యింది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు పెద్దగా హడావుడి లేదు. కాని ఈసారి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుండి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు తారలు వెళ్లబోతున్నారు. రెడ్ కార్పెట్ పై తార తోరణం కళకళలాడబోతుంది.

అంతర్జాతీయ స్థాయి వేదికపై మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ నుండి ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ సందడి చేయడం జరిగింది.

ఇన్నేళ్ల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ కు దక్కిన గౌరవం తక్కువే. కాని 75 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాత్రం సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ కు అరుదైన గౌరవం దక్కింది.

బుట్ట బొమ్మ పూజా హెగ్డే కు ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం దక్కిన విషయం తెల్సిందే. పూజా హెగ్డే తో పాటు నయనతార మరియు తమన్నాలు కూడా ఈ సారి రెడ్ కార్పెట్ పై సందడి చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈనెల 17 నుండి 28వ తారీకు వరకు జరుగబోతున్న ఈ కార్యక్రమంలో ఇండియన్ సినీ తారలు ఎంతో మంది హాజరు కాబోతున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటి రోజు భారత్ తరపున అక్షయ్ కుమార్.. దీపిక పదుకునే.. ఏఆర్ రహమాన్.. పూజా హెగ్డే.. నయనతార మరియు తమన్నా వంటి వారు రెడ్ కార్పెట్ పై సందడి చేయబోతున్నారు. ఇండియాస్ క్లాసిక్ మూవీ ప్రతిధ్వని స్క్రీనింగ్ కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక అవ్వబోతుంది. ఇక సౌత్ ఇండియన్ మూవీ విక్రమ్ ట్రైలర్ ను కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా విడుదల చేయబోతున్నారు.

మొత్తానికి ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియాకు మంచి గౌరవం దక్కబోతుంది. అంతే కాకుండా సౌత్ ఇండియన్ స్టార్స్ కు కూడా మంచి గౌరవం దక్కబోతుంది. అంతర్జాతీయ వేదికపై మొదటి సారి మన స్టార్స్ కు అరుదైన గౌరవం దక్కడంతో సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సినిమాలు ఈమద్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గడం లేదు. కనుక సౌత్ స్టార్స్ కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఛాన్స్ దక్కింది.
× RELATED పేరున్న డైరెక్టర్..పాన్ ఇండియా మూవీ..బజ్ జీరో!
×