చైతన్య 'థాంక్యూ' చెప్పడానికి డేట్ ఫిక్సైంది

యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభమై చాలా కాలమైంది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు ఓ అప్ డేట్ వచ్చింది. అయితే  రిలీజ్ తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

సినిమా లాంచ్ అయిన దగ్గర నుంచి యూనిట్ ఎలాంటి అప్ డేట్  ఇవ్వలేదు. దీంతో రిలీజ్ ఎప్పుడో అర్ధంకాని సందిగ్ధంలో అభిమానులు సైతం పడాల్సి వచ్చింది. రిలీజ్ జూన్ లో ఉంటుందా జులైలో  ఉంటుందా? అని కొన్ని రకాల సందేహాలు తెరపైకి  వస్తున్నాయి. తాజాగా వాటన్నింటికి యూనిట్  క్లారిటీ ఇచ్చేసింది. కొద్ది సేపటి క్రితమే రిలీజ్ తీదీని రివీల్ చేస్తూ  చైతన్య కొత్త పోస్టర్ తో చెప్పేసారు.

జులై 7వ తేదీన చిత్రాన్ని థియేటర్లోనే ప్రేక్షకుల  ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చైనత్య కొత్త పోస్టర్ లో లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జీన్స్..టీషర్ట్ ధరించి ఆపైనా బ్లాక్  కోట్ తో మొత్తం కప్పేసి కనిపిస్తున్నాడు. ఫేస్ లో స్మైల్...బీయర్డ్...కళ్లకి అద్దాలు తో కొత్త లుక్ ని పరిచయం చేసాడు. బ్యాక్ గ్రౌండ్ లో  ఎత్తైన భవనాలు హైలైట్ అవుతున్నాయి.

మరి ఈ సినిమా ఇతివృత్తాంతం ఏంటన్నది తెలియాలి. విక్రమ్ సినిమాలు రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. అందులోనూ తెలుగు సినిమాలతో ఆయన సినిమాల్ని ఏ మాత్రం మ్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అక్కినేని  ఫ్యామిలీ హీరోలతో ఇప్పటివరకూ రెండు సినిమాలకు  పనిచేసారు. తొలిసారి ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి `మనం` చిత్రాన్ని తెరకెక్కించగా...అటుపై అకిల్ ని `హలో` సినిమాతో డైరెక్ట్ చేసారు.

అఖిల్ కి ఈ సినిమా నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ రకంగా అక్కినేని ఫ్యామిలీతో విక్రమ్ బాండింగ్ ఎంతో  స్ర్టాంగ్.  అందుకే మరోసారి `థాంక్యూ`తో  చైని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగచైతన్యకి జోడీగా  రాశీఖన్నా నటిస్తుంది.  శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం స్వరాలు సమకూర్చుతుండగా..ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీ.సి శ్రీరామ్ ఆ బాధ్యతలు తీసు కున్నారు.

ఇక చైతన్య  ఇటీవలే `లవ్ స్టోరీ`తో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకుని స్వింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా చైతన్యకి  నటుడిగా కొత్త ఐడెంటిటీని తీసుకొచ్చింది. సెటిల్డ్  పెర్పార్మెన్స్ తో  అన్ని వర్గాల ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. మరి `థాంక్యూ` తో   ఆసక్సెస్ వేగాన్ని  కంటున్యూ చేస్తారా?  లేదా? అన్నది చూడాలి.
× RELATED పేరున్న డైరెక్టర్..పాన్ ఇండియా మూవీ..బజ్ జీరో!
×